Headlines

ఏపీలో ఎన్నికల రగడ..

౼ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ౼ సహకరించలేమంటున్నఉద్యోగ సంఘాలు ౼ అనుకూలపరిస్థితులు లేవంటున్న ప్రభుత్వం ౼ వివాదాస్పదంగా ఎన్నికల కమిషనర్ నిర్ణయం అమరావతి: ఏపీలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రరి 5,9,13,17 తేదీల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన మీడియా సమావేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ…

Read More

భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు!

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ శనివారం బెయిల్ పై విడుదలయ్యారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. 15 రోజులకొకసారి బోయినపల్లి స్టేషన్లో రిపోర్ట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అఖిల ప్రియ విడుదల సందర్భంగాచంచల్ గూడ జైలు వద్ద అనుచరులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హఫిజిపేట భూవివాదానికి సంబంధించి ప్రవీణ్, సునీల్, నవీన్ ముగ్గురు సోదరులు కిడ్నాప్ కేసులో ఆమె…

Read More

మహోన్నత వ్యక్తులను అందించిన నేల బెంగాల్: మోదీ

దేశంలోని అన్నిరంగాల్లో వెలకట్టలేని ఎందరో మహోన్నత వ్యక్తులను అందించిన నేల బెంగాల్  అని మోదీ అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్  వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాత్రంతం కోసం పోరాడిన నేతల్లో నేతాజీ ఒకరని ,ఆయన చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని , ప్రతి భారతీయుడు ఆయనకు…

Read More

సాజిద్ ఖాన్ పై నటి లైంగిక ఆరోపణలు!

బాలీవుడ్లో నెపోటిజం(బంధుప్రీతి) , మీటూ ఉద్యమంపై (లైంగిక దాడి) గురించి ఏళ్ల నుంచి చాల మంది హీరోలు, హీరోయిన్స్.. దర్శకులు ప్రొడ్యూసర్స్ పై కామెంట్స్ చేయడం తరచు జరుగుతుంది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తరవాత నెపోటిజంపై.. తనుశ్రీ దత్తతోపాటు పలు ఇండస్ట్రీ హీరోయిన్స్ మీటూ ఉద్యమం పై పోరాడడంతో జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరిగిన విషయం తెల్సిందే. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ , సోషల్ మీడియా సెన్సేషన్ షెర్లిన్ చోప్రా…

Read More

ఫిబ్రవరిలో శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు..?

తెలంగాణలో పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు, ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశముంది.  ఎమ్మెల్సీలుగా రామచందర్ రావు(మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్), పల్లా రాజేశ్వర్ రెడ్డి(నల్గొండ-ఖమ్మం-వరంగల్)ల, పదవీ కాలం మార్చి 29 న ముగుస్తుండడంతో , వారి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది ఓటర్ల జాబితా పూర్తవడం, ఎన్నికల పోలింగ్ స్థావరాలను గుర్తింపుతో ఎన్నికలకు మార్గం సుగమైంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికలకు కేంద్రం షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. కాగా మహబూబ్నగర్ లో ఓటర్ల జాబితా…

Read More

టీమిండియా కెప్టెన్సీ మార్పు పై హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  టీమిండియా కెప్టెన్ మార్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు కెప్టెన్సీ మార్పు మంచిది కాదని  ఆప్రభావం కోహ్లీ ఆటతీరుపై  పడుతుందని, ఇది భారత క్రికెట్ సంస్కృతికి విరుద్ధమని హెచ్చరించాడు. క్రికెట్లో ఎంతపెద్ద ఆటగాడికైనా ఒడిదుడుకులు సహజమని అంతమాత్రాన అతని శక్తి సామర్ధ్యాలను శంకించడం సబబు కాదని హితువు పలికాడు. ఆస్ట్రేలియా టూర్లో అతని సారధ్యంలో జట్టు వన్డే సిరీస్ కోల్పోవడం, అడిలైడ్ టెస్టులో అత్యల్పంగా 36 పరుగులకే…

Read More

రామ మందిర నిర్మాణానికి జనసేనాని భారీ విరాళం!

అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు శ్రీ భరత్ జీ గారిని కలిసి చెక్కును అందజేశారు. అతనితో పాటు వ్యక్తిగత సిబ్బంది సైతం ఆలయానికి విరాళమిచ్చారు( రూ. 11000) . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతి ఉప ఎన్నిక…

Read More

దీదీకి మరోషాక్!

బెంగాల్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తృణమూల్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు నేతలు, నాయకులు పార్టీని విడడంతో అధినేత్రి మమతా బెనర్జీ కి మింగుడుపడడం లేదు. తాజాగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ పార్టీ,పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ సంఘటనతో పార్టీలోఅంతర్మధనం మొదలైంది. బెనర్జీ రాజీనామా లేఖను ట్వీటర్లో పోస్ట్ చేస్తూ.. ఇన్నాళ్లపాటు ప్రజల సేవ…

Read More

బీహార్ ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నా: ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పరువుకు భంగంకలిగించే తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ నేరాల కింద చర్యలు తీసుకోనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడం బీహార్ లో చాలా అరుదు. అయితే ఈ తరహా ప్రచారం మరీ శృతిమించుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ లో సర్క్యులేట్…

Read More

టీఆర్పీ రేటింగ్స్ రిగ్గింగ్!

దేశవ్యాప్తంగా ప్రింట్ పత్రికల రేటింగ్స్ కి సంబంధించి ప్రతి ఏటా జరిగే గోల్మాల్ రిగ్గింగ్ విషయం అందరికి తెలిసిందే. పత్రికా సంస్థలు ఏబిసికి చెప్పే లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన ఉండదనేది కాదనే వాస్తవం. ఈ రేటింగ్స్ రిగ్గింగ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకు పాకీ దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ప్రేక్షకాదరణకు కొలమానమైన టీవీ చానళ్ల టీఆర్పీ రేటింగ్స్లో బార్క్( బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) మాజీ పెద్దలు రేటింగ్స్ రిగ్గింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు…

Read More
Optimized by Optimole