Headlines

National: బీహార్‌ ఎన్నికల దిక్సూచి ఎటువైపు…?

Bihar election2025: దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పాట్నా రాజధానిగా గల బీహార్… సంకీర్ణ ప్రభుత్వాలకు ‌పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ,…

Read Full News

స్టార్ ఆటగాళ్లకు ఝలక్ :

ఐపీఎల్ సీజన్ 2021 వేలం కోసం ఫ్రాంచైజీలు సరికొత్తగా సిద్ధమవుతున్నాయి. టీంలకు నమ్మినబంటుగా ఉన్నటువంటి స్టార్ ఆటగాళ్లను వదిలించుకోని కుర్రాళ్ళుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్, ముంబై శ్రీలంక పేసర్ లసిత్ మలింగాను వదిలించుకుంది. ఐపీఎల్ విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఆరుగురు ఆటగాళ్లను వదిలేసుకుంది. అయితే ఊహించని విధంగా స్టార్ ఆటగాడు సురేష్ రైనాను రిటైన్ చేసుకుంది. ఫ్రాంచైజీలు…

Read Full News

తెలంగాణలో బీజేపీ నేతల దూకుడు.. పార్టీలోకి భారీగా చేరికలు?

తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడుమీదున్నారు. అధికార పార్టీ పై మాటల తూటాలు పేలుస్తునే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ప్రజాగోస భరోసా కార్యక్రమం పేరిట ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు కమలం పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా.. అతనితో పాటు మరికొంతమంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు అదే దారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరికలపై ఆపార్టీ అధ్యక్షుడు…

Read Full News

కర్ణాటకలో కాంగ్రెస్‌దే పైచేయి.. పీపుల్స్‌ప‌ల్స్ ఎగ్జిజ్‌పోల్‌ రిపోర్ట్‌…

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం అని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ సౌత్‌ ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వెల్లడయింది. హోరాహోరీ పోరులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలను  గెలుపొంది మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100  స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదే సమయంలో జేడీ(ఎస్‌) తనకు పట్టున్న స్థానాల్లో అధిప‌త్యం కొన‌సాగిస్తుంద‌ని.. ఇత‌రులు 1 నుంచి3 స్థానాల్లో  గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు…

Read Full News

వర్షంలో తడవకుండా మేకలకు రెయిన్ కోట్ .. వీడియో వైరల్

తెలంగాణలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముప్పుప్రాంతాల్లో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. జంతువుల వ్యథ వర్ణానాతీతం. ఈనేపథ్యంలో జంతువుల ఇబ్బంది పడడాన్ని చూసిన ఓ వ్యక్తి వాటికి రెయిన్ కోట్స్ వేశాడు. ఈఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివారాల్లోకి వెళితే.. జిల్లాలోని అంతర్గాంకు చెందిన మీనయ్యకు మేకలు ఉన్నాయి. అతను వాటిని రోజూ పొలాలు, గుట్టల్లోకి మేతకు తీసుకెళ్తాడు. అయితే గతవారం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన…

Read Full News

బాలలకు స్వేచ్ఛ, వికాసం కల్పించాలి: ఎస్పీ అపూర్వ రావు

నల్గొండ : బాలలకు స్వేచ్ఛ, వికాసం కల్పించాలన్నారు జిల్లా ఎస్పీ అపూర్వ రావు. నిరాద‌ర‌ణ‌కు గురైన పిల్ల‌ల‌కోసం కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆప‌రేష‌న్ స్మైల్,ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు.జనవరి 1వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-IX కార్యక్రమం ద్వారా 82 మంది బాలలను గుర్తించి చేర‌దీశామ‌న్నారు. ఇందుకు సంబంధించి 72 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింద‌న్నారు. ఎవరైనా బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కలిగించేలా ప్ర‌వ‌ర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని…

Read Full News

జనసేన-టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం ఆగిపోదు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra4: ‘జనసేన – తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిపోవడం జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.పేదలు, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్న ఏ పథకం నిలిపివేయడం జరగదని.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత అదనంగా జోడించి వారిని ఆదుకునేలా  ప్రణాళికలు  రూపొందిస్తామని తెలిపారు. అప్పుల ద్వారా కాకుండా ఆదాయం సృష్టించి ప్రజలకు మరింతగా ఇవ్వాలన్నదే తమ ఆకాంక్షగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని వనరులను…

Read Full News
Optimized by Optimole