తృణమూల్ కుట్రలకు పాల్పడుతోంది : ప్రధాని మోదీ
బెంగాల్ నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. శనివారం కూచ్‌బెహార్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల నుంచి స్థానికులు తుపాకులు లాక్కొనేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఓట్లు వేయడానికి వచ్చిన వారిపై కొందరు రాళ్లు రువ్వారని, భద్రత బలగాలతో ఘర్షణకు దిగారని, తప్పని పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాక కూచ్‌బెహార్ జిల్లాలోని మరో…