ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు : పవన్ కళ్యాణ్

APpolitics:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయన్నారు జన సేన అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ  పట్టభద్రుల నియోజక వర్గాల ఎం.ఎల్.సి. స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సందిగ్ధంలో ఉన్నవారికి…

Read Full News

టి-20 వరల్డ్ కప్ వేదికలు ఖరారు!

స్వదేశంలో జరగబోయే టీ-20 వరల్డ్ కప్ వేదికలను బీసీసీఐ శనివారం ఖరారు చేసింది. ఫైనల్ తో సహా మిగతా మ్యాచ్ లను 8 వేదికల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌క‌తా, బెంగుళూరు, హైద‌రాబాద్, ధ‌ర్మ‌శాల న‌గ‌రాల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా అధికారికంగా ప్రకటించాడు. ఫైన‌ల్ మ్యాచ్‌ను అహ్మ‌దాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం(మోతెర)లో నిర్వ‌హించ‌నున్నారు. కాగా ప్రపంచకప్లో పాల్గొనబోయే పాక్ ఆటగాళ్ల వీసా విషయంలోను స్పష్టత వచ్చినట్లు షా పేర్కొన్నారు.  

Read Full News

Karimnagar: ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో టెన్త్ విద్యార్థులకు బండి సంజయ్ నజరాన..!

Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ శుభవార్త. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్ధినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్…

Read Full News

Telangana: త్వరలో తీహార్ జైలుకు కేసీఆర్ కుటుంబం: గజ్జలకాంతం

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పీసీసీ నూతన ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. శనివారం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. దళితుల వర్గీకరణను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు….

Read Full News

Climatechange: సమర్థ నాయకత్వమే సవాల్..!

Globalleadershipproblem: ప్రపంచమే తీవ్ర నాయకత్వ సమస్యనెదుర్కొంటోంది. సమకాలీన సమస్యల్ని సానుభూతితో పరిశీలించి, అర్థం చేసుకొని.. విశాల జనహితంలో సాహస నిర్ణయాలు తీసుకునే చొరవగల నాయకత్వానికి ఇప్పుడు మహాకొరత ఉంది. ఫలితంగా ఎన్ని అనర్ధాలో ! మానవాళి మనుగడకే ప్రమాదం తెస్తున్న ‘వాతావరణ మార్పు’ (క్లైమెట్ చేంజ్) విపరిణామాలు అడ్డుకునేందుకు పెద్దఎత్తున నిర్వహించే భాగస్వామ్య దేశాల సదస్సు`కాప్ కూడా విఫలమౌతోంది. దాదాపు రెండొందల దేశాలు పాల్గొనే ఈ సదస్సులు ఏటేటా ఆశావహ వాతావరణంలో మొదలై, కడకు ఉస్సురనిపిస్తూ ముగియడం…

Read Full News

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు!

కర్ణాటకను కుదిపేసిన హిజాబ్‌ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదని..విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హిజాబ్ వివాదంపై తీర్పును వెలువరించింది. కాగా ఈ ఏడాది జనవరిలో, ఉడిపి పాఠశాల్లో హిజాబ్‌ వస్త్రధారణ పై వివాదం చెలరేగింది. దీంతో కొంతమంది బాలికలు…

Read Full News

Sangareddy: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొంతుకోసి హత్య చేసిన యువకుడు…!

సంగారెడ్డి: ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని క ఓ యువకుడు ఘోరానికి ఒడిగట్టాడు. ఆమెను న గొంతుకోసి హత్య చేసిన అనంతరం తానూ ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన బొత్స శ్రీనివాస రావు, ఈశ్వరమ్మ దంపతులు సుదీర్ఘకాలంగా సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె రమ్య (23), చందానగర్‌లోని ప్రగతి డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది….

Read Full News

2024 ఏపీ కింగ్‌ మేకర్‌ ఎవరు..? జ‌న‌సేన రోల్ ఏంటి?

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి  మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్‌ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే అది వాపేగానీ, బలుపు కాదు….

Read Full News

జనసేన ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు నాంది: నాదెండ్ల మనోహర్

బెజవాడ కృష్ణమ్మ జన సునామీతో ఉప్పొంగిందా..? బందరు సముద్ర తీరం ముందుకు వచ్చిందా అన్నట్లు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఇంత జనమా? అనే ఆశ్చర్యం కలిగే రీతిలో జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి తరపున, పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ పదో ఆవిర్భావ…

Read Full News

పక్కదారి పట్టిన ప్రచారం

నేను రెండో క్లాస్‌లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్‌ని ఒక విషయం అడిగినప్పుడు ‘గాడిద గుడ్డు’ అని విసుక్కున్నారు. అప్పుడు నాకు గాడిద గుడ్డు పెడుతుందా..? అనే సందేహం వచ్చింది. చిన్నతనంలో నాకు వచ్చిన సందేహమే ప్రస్తుతం నా పిల్లలకు కూడా వచ్చింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇప్పుడు ‘గాడిద గుడ్డు’ తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణలో మూడోసారి హోరాహోరీగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం పరాకాష్టకు…

Read Full News
Optimized by Optimole