మునుగోడుపై నిధుల వర్షం.. వ్యూహాం మార్చనున్న రాజగోపాల్?
తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చనడుస్తోంది. ఉప ఎన్నిక వస్తేనే హుజురాబాద్ తరహాలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రకటించిన .. రెండు రోజుల్లోనే ప్రభుత్వం 33 కోట్లు నిధుల మంజూరుకై ప్రపోజల్స్ పంపాలని ఆదేశాలను జారీచేసింది. ప్రజాసమస్యలపై పలుమార్లు రోడ్లెక్కి, రాస్తారోకోలు చేసినా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోవడంతోనే నిధులు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్యే…