కుటుంబ పాలన విముక్తే థ్యేయంగా సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు సంజయ్.తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని తెలిపే ప్రదేశాలతో పాటు.. స్వరాష్ట్రంకోసం ఆత్మబలిదానాలు చేసిన గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. వివిధ ప్రాంతాల్లో జరిగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అవినీతి.. కుటుంబ పాలన విముక్తికే యాత్ర కొనసాగనున్నట్లు కమళదళపతి స్పష్టం చేశారు. ఇక…

Read More

వరుస సభలతో హోరెత్తిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు దూసుకుపోతున్నారు . పార్టీలోకి చేరికలతో పాటు వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభ, ముగింపు సభలను భారీగా నిర్వహించాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఈసభలకు భారీ జనసమీకరణ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించారు. ఐదు జిల్లాల్లో మూడు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజాసమస్యలను సంజయ్ స్వయంగా అడిగితెలుసుకోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఆగస్టు 2న ప్రారంభమయ్యే ప్రజాసంగ్రామ యాత్ర…

Read More

ఎంపీ అరవింద్ పై దాడి కేంద్రం సీరియస్.. బీజేపీ నేతలు ఫైర్!

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. కే్ంద్ర హోమంత్రి అమిత్ షా దాడిని ఖండించారు. నేరుగా అరవింద్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను ఎంపీని అడిగి తెలుసుకున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు దాడిని ఖండించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయడం సిగ్గు చేటన్నారు బండిసంజయ్. బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల…

Read More

తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోన్న కమలనాథులు!

తెలంగాణలో విజయ సంకల్ప సభ సక్సెస్ తో జోరుమీదున్న కమలనాథులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీలను నియమించిన రాష్ట్ర నాయకత్వం.. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ.. ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాచారం హక్కు చట్టం కింద ఒకేసారి 88 దరఖాస్తులు చేసి షాకిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో…

Read More

టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్.. మలి విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ!

దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సంగతి చూస్తామన్న ఆయన.. తేడా వస్తే గడీలు బద్దలు కొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను అంతమొందించడానికే మలి దశ పాదయాత్ర ప్రారంభించినట్లు సంజయ్‌ స్పష్టం చేశారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇమామ్‌పూర్‌ నుంచి నాలుగు కిలోమీటర్లు వరకు మొదటి రోజు యాత్ర నిర్వహించారు. అంతకు…

Read More

తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి అగ్రనాయకత్వం!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, శ్రేణులను జాతీయ నాయకత్వం సన్నద్ధం చేస్తోంది. ఇటివల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న కమలదళం.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణాలో బీజేపీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం!

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. దీంతో నాడు తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే అభ్యర్థుల జాబిత ప్రకటించాలని బీజేపీ జాతీయ అధినాయకత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఇప్పటికే కొన్నింటిలో ఒకరు.. మరికొన్నింట్లో ఇద్దరు లేక…

Read More

మంత్రి ‘కంటోన్మెంట్’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్!

రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్​ బోర్డుపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాటర్ సప్లై నిలిపివేస్తామనడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్​లో కరెంట్ కట్ చేస్తామనడం దేశద్రోహ చర్యగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌కు…

Read More

బీజేపీ సెగతోనే ఉద్యోగాల ప్రకటన: బండి సంజయ్

బీజేపీ ప్రభుత్వానికి భయపడే సీఎం కేసిఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసీఆర్​ను వదిలిపెట్టేదే లేదని తేల్చిచెప్పారు. కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని కేసీఆర్ అనటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో జారీ చేశారన్నారు. 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని.. ప్రకటించిన ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని ఆయన…

Read More

కేసిఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి_ బండి సంజయ్

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసుపెట్టాలన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్‌ను కేసీఆర్‌ అవమానించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మర్చాలనడం వెనక ఉద్దేశ్యం ఏంటో తెలపాలన్నారు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కుంభకోణాల్ని బయటికి తీయబోతున్నామన్నారు. త్వరలో ఆయన అరెస్ట్‌ ఖాయమని తెలిసే.. ప్రజల్లో సానుభూతి కోసం కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దళితుడైనందుకే…

Read More
Optimized by Optimole