ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు స్వర్ణం..
Cricket: ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2023 లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో లంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత జట్టు విజయం ఖరారైంది.