ఆదివాసీ గిరిజనులు కోసం కరసేవ ప్రారంభం: బండి సంజయ్

తెలంగాణలో పొడుభూములు,అదివాసులు, గిరిజనులు కోసం భాజపా యుద్ధం మొదలెట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుర్రంబోడు తండాలో సభలో ఆయన మాట్లాడుతూ.. నాడు అయోధ్యలో రామాలయం కోసం కరసేవ చేశామని నేడు పేదల కోసం గుర్రంబోడు తండా నుంచి కరసేవ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న గిరిజన భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేసి, వారిమీద అక్రమ…

Read More

దేశ ప్రతిష్టతను దిగజార్చే కుట్ర: మోదీ

దేశ ప్రతిష్టతను దిగజార్చేందుకు కొన్ని విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం అసోంలోని సొంటిపూర్ జిల్లాలో టీ కార్మికులు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పరిశ్రమల గురించి బయటి శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అలాంటి వారికి మద్దతు తెలిపే రాజకీయ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని మోదీ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం 8 వేల కోట్లతో తలపెట్టిన ‘అసోంమాల’ పథకాన్ని ఆయన…

Read More

ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం : అనురాగ్ ఠాకూర్

కరోనా తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 2020-21 వార్షిక బడ్జెట్ రూపొందించామని కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంతో కష్టాల్లో ఉన్నవారిపై ఎలాంటి భారం పడకుండా.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకెళ్తూమాని అన్నారు. అనంతరం లఘు ఉద్యోగ భారతి సంస్థ నిర్వహించిన పారిశ్రామిక వేత్తలు, మేధావులతో చర్చా గోష్టిలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సూచన…

Read More

దేశ ప్రతిష్టతను మసకబార్చే కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

భారత్ ప్రతిష్టతను మసక అంతర్జాతీయ కుట్ర జరుగుతొందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. నాగపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రఖ్యాత సెలబ్రెటీలు ట్వీట్స్ వెనక అంతర్జాతీయ కుట్ర దాగుందని ఆయన తెలిపారు. దేశంలో గందరగోళం వాతావరణం సృష్టించి అల్లర్ల రేపే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా రైతులకు మద్దతు తెలుపుతూ హాలీవుడ్ పాప్ సింగర్ రిహనా, ప్రపంచ పర్యావరణ వేత్త గ్రేటా…

Read More

బెంగాల్లో నియంత పాలన కొనసాగుతోంది: అమిత్ షా

బెంగాల్ లో నియంత పాలన కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆదివారం హౌరాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. మమతా ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే నేతలు తృణముల్ పార్టీని వీడి భాజపాలో చేరుతున్నట్లు షా వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తుంటే, దీదీ అల్లుడు శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అన్నారు. దీదీ హయాంలో, దోపిడీలు దొంగతనాలు అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు. కాగా ఎన్నికల సమయానికి పార్టీ అంతా…

Read More

మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్

కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక…

Read More

అసోంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం : అమిత్ షా

అసోంలో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కోక్రఝార్ లోని బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రాన్ని అవినీతి, ఉగ్రవాద రహితంగా మార్చిందని.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏకు పట్టం కడతారని స్పష్టం చేశారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలకు ముగింపు పలుకుతూ పలు ఒప్పందాలు జరిగాయన్నారు. గత పాలకుల హయాంలో ఒప్పందాలు…

Read More

ఆమె చేతిలో ఓడిపోతే రాజకీయాలు నుంచి తప్పుకుంటా: సువెందు అధికారి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి సవాల్ విసిరారు బీజేపీ నేత సువేందు అధికారి. సోమవారం ఓ బహిరంగ సభలో దీదీ నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె (మమతా బెనర్జీ)ఎన్నికల సమయంలో మాత్రమే నందిగామ్…

Read More
Optimized by Optimole