తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు బీజేపీదే: బండి సంజయ్

BJPTelangana: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.  కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలే నిదర్శనమన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాదిమంది నిరుద్యోగులు, ఏఎన్ఎంలపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  డాక్టర్ చెన్నమనేని వికాస్, చెన్నమనేని దీప దంపతులు బీజేపీలో…

Read More

చంద్రయాన్-3 విజయం.. యావద్భారతీయులది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

BJPTelangana: చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజవంతంగా ల్యాండ్ అవడం.. యావద్భారతం గర్వించే క్షణమని గౌరవ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన  తొలి దేశంగా నిలిచిందన్నారు.బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన అద్వితీయమైన ఘట్టాలను.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై కిషన్ రెడ్డి…

Read More

ఎవరి గోల వారిదే…

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ(రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ):  తెలంగాణాలో నాలుగు నెలల్లో జరగనున్న మూడవ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని పార్టీలు వ్యూహరచనలలో తనముకలయ్యాయి. ఎవరికివారే ఎదుటువారిని దెబ్బకొట్టేలా ఎత్తుగడలు వేస్తుండడంతో రాష్ట్రంలో అయోమయం రాజకీయ వాతావరణం నెలకొంది. బడాబడా హామీలతోపాటు ఎదుటి పక్షాలపై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. తమ అభ్యర్థులు సరైన పోటీ ఇవ్వగలరో లేదో సంశయంతో ఇతర పార్టీల నేతలను అక్కున చేర్చుకుంటున్నారు. నేడు ఒక పార్టీలో ఉన్న వారు తెల్లారేసరికి ఎవరి పంచన…

Read More

తెలంగాణ బీజేపీకి అమిత్ షా వార్నింగ్..టార్గెట్ ఫిక్స్..!

BJPTelangana: తెలంగాణ బిజెపి నాయకత్వానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆరు నూరైనా సరే  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ 75 సీట్లు గెలిచి తీరాలని రాష్ట్ర నాయకత్వానికి షా  టార్గెట్ ఫిక్స్ చేశారని.. ఇందులో  భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలంతా హై…

Read More

Telangana: డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీపై బీజేపీ ధర్నాలు

BJPTelangana: డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలనే డిమాండ్‌తో తెలంగాణా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలు చేపట్టింది. ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని ధర్నాలు, ఆందోళనల్లో నేతలు డిమాండ్‌ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి.. ప్రజల్ని మోసం చేశారని కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమీపించడంతో మరోసారి ఓట్లు దండుకునే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్…

Read More

బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?

Nancharaiah merugumala senior journalist:  బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?రాజకీయ పరిశోధకుడు అసీం అలీ అంచనా! తెలంగాణలో పాలకపక్షం భారత రాష్ట్ర సమితికి (బీఆరెస్‌) ప్రధాన ప్రత్యర్థిగా అవతరించాలనుకున్న హిందుత్వ రాజకీయపక్షం బీజేపీ అంచనాలు తారుమారవుతున్నాయని దిల్లీ రాజకీయ పరిశోధకుడు అసీం అలీ భావిస్తున్నారు. అడపాదడపా ఆంగ్ల పత్రికల్లో వ్యాసాలు రాసే అసీం అలీ విశ్లేషణలు ‘అతి సెక్యులర్‌’ భావాలతో కాస్త వాస్తవ విరుద్ధంగా కనిపిస్తాయి. హిందుత్వ బీజేపీని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు 2024లో విజయవంతంగా…

Read More

అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి?: బండి సంజయ్

BJPTelangana: తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాభివ్రుద్దే బీజేపీ లక్ష్యమని అన్నారు. తెలంగాణలోని…

Read More

వచ్చే ఎన్నికల్లో గెలుపు నాదే: సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో విజయం తనదేనని ధీమా వ్యక్తంచేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు.రెండుసార్లు ఓటమి పాలైన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని  తెలిపారు. తన వెంట ఉన్న నాయకులందరినీ అధికార పార్టీ డబ్బులతో లొంగదీసుకున్నా.. నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. 2014లో పార్టీ టికెట్ రాకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే.. నియోజక వర్గ ప్రజలు చూపించిన ఆదరణను  మర్చిపోలేదని సంకినేని గుర్తు…

Read More

ఆరునూరైనా సూర్యాపేటలో కాషాయ జెండా ఎగరేస్తాం: సంకినేని వెంకటేశ్వరరావు

తెలంగాణలో కొనసాగుతున్న అవినీతి పరిపాలనను అంతం చేయడానికి బీజేపీ  సిద్ధమైందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. శనివారం జరగనున్న పోలింగ్ బూత్ కార్యకర్తల సమ్మేళనం సభా స్థలిని ఆయన కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ ద్వారా పోలింగ్ బూత్ కార్యకర్తల తో మాట్లాడి దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. రాష్ట్రం తో పాటు, సూర్యాపేటలో జరుగుతున్న అవినీతిని కార్యకర్తల సమన్వయంతో ప్రజల్లోకి…

Read More

7 వ తేదీన పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం: సంకినేని

సూర్యాపేట: తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణను రూపొందించిందన్నారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. పార్టీ ఆదేశానుసారం.. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు. గురువారం సంకినేని నివాసంలో నియోజక వర్గ శక్తి కేంద్ర ఇంచార్జ్ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. ఈనెల 7వ తేదీన త్రివేణి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ  పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ అధ్యక్షులు జేపీ…

Read More
Optimized by Optimole