Telangana: గాడిద గుడ్డు పేరుతో బిజేపి పై కాంగ్రెస్ ఎటాక్..వినూత్న నిరసన..!

In Telangana: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు…

Read More

Runamaphi: రైతు రుణమాఫీతో కాంగ్రెస్ ఎస్కేప్ ప్లాన్ ..!

Telangana: రుణమాఫీతో తమది రైతు అనుకూల ప్రభుత్వమని నమ్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం భారీ ఎత్తున ప్రకటనలకు, సంబరాలకు కోట్ల రూపాయిల్ని ప్రభుత్వం మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. మొదటి విడతలో చేసిన మాఫీతో అన్నదాతలందరూ తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది.  ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణమాఫీ సంపూర్ణంగా లేకుండా ఒక మాయాజాలంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం పారదర్శకతతో అమలు చేస్తేనే…

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

Telangana: పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్: బండి సంజయ్

BjpTelangana:  ‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికలు రావడంతో ‘ఇప్పుడు ఓటేయండి. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం పెద్ద బోగస్’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అని మండిపడ్డారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇవ్వలేనోడు… తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొనలేనోడు.. ఏకంగా…

Read More

Telangana: తెలంగాణ లోక్ సభ లో బీజేపీ హవా.. newsminute24 ట్రాకర్ పోల్ సర్వే..!

Loksabhaelections2024:   తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధిక సీట్లు గెలిచే అవకాశం ఉందన్న దానిపై పలు సర్వే సంస్థలు ప్రజానాడీ తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా newsminute24 వెబ్ సైట్ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ పార్టీ అధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. రెండవ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిలిచే అవకాశం ఉన్నట్లు newsminute24 సర్వే…

Read More

ప్రీ_ పోల్ సర్వేలతో డైలమాలో తెలంగాణ ఓటర్లు..!

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్ట్):  గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రీ- పోల్‌ సర్వేలు రాజకీయ పార్టీలను, ఓటర్లను ఆయోమయానికి గురి చేస్తున్నాయి. జాతీయ సర్వే.. మీడియా..  పోల్‌ మెనేజ్‌మెంట్‌  సంస్థలు ప్రీ పోల్‌ సర్వేలను విడుదల చేశాయి. సర్వేల్లో మెజార్టీ కాంగ్రెస్‌ గెలుస్తుందిని.. కొన్ని సంస్థలు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, బీజేపీ, బీఎస్‌పీ పార్టీలు ప్రధాన పార్టీల కొంప ముంచనున్నాయని ఇలా ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు సర్వేలు బహిరంగం వెల్లడించాయి. …

Read More

రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!

Nancharaiah merugumala senior journalist:   (‘సోనియా తెలంగాణ ఇస్తే–కేసీఆర్‌ దాన్ని దిల్లీ నుంచి మోసుకొచ్చాడు’..తెలంగాణ జనాన్ని నాడు ఆంధ్రోళ్లు సైతం ఇలాంటి ‘బూతు మాటల’తో కించపరచలేదే!రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!) ………………………………………………………………………….. ‘ఆనాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆస్‌ నేత కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ పరిస్థితి అధ్వానంగా ఉండేది,’ అని గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌ రెడ్డి పెద్దపల్లిలో అన్నారు. 1956–2014…

Read More

జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల రచ్చ.. బీఆర్ఎస్ కు తలనొప్పిగా నల్లగొండ..

Telanganapolitics: తెలంగాణాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై పెద్ద చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల  గడువు మాత్రమే ఉండటంతో ఇండ్ల స్థలాల వ్యవహారం   బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీనికి తోడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అనుచరులకు జర్నలిస్టుల స్థలాలు కేటాయించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి. https://youtu.be/fdhqIi5CY0Q?si=0QmkHGF13h2FEr1Nhttps://youtu.be/fdhqIi5CY0Q?si=0QmkHGF13h2FEr1N

Read More

చూపంత తెలంగాణ వైపే..రెండు రోజులు రాజకీయ సందడి..

Telangana politics: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల కాలేదు. జమిలి ఎన్నికల ప్రక్రియ ఊసే లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి  ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడను లేదు. కానీ తెలంగాణలో రెండు రోజుల పాటు జరగనున్న మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ సభలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  నేతలు మాటల తూటాల పేల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా…

Read More

రాజకీయ పార్టీల్లో ముదురుతున్న లోల్లులు..

telanganapolitics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో..?లేదో..? తెలియని పరిస్థితి.  ఎన్నికల నిర్వాహణ సంస్థ ‘‘ఎన్నికల సంఘం’’లో ఉలుకుపలుకు కనిపించడం  లేదు.  తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్లుగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ 115 అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలు చేయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తొందర పడుతున్నాయి. టీకెట్ల ప్రకటన అనంతరం బీఆర్‌ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో మొదలైన లొల్లి తుమ్మల నాగేశ్వర్‌రావు వరకు పాకింది.నేటికి అధికార పార్టీ ఆశావాహుల్లో టికెట్లు రాలేదన్న…

Read More
Optimized by Optimole