విద్యాదాత మల్లన్నకే ఇన్ని కష్టాలు.. బక్కరెడ్లు, బడుగు రెడ్లు ఎలా బతకాలి?
Nancharaiah merugumala: ……………………………………………….. కొన్ని దశాబ్దాల క్రితం బర్రెలను మేపుతూ, పేడ ఎత్తుకుంటూ, పాలు పితికారు తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి చామకూర మల్లా రెడ్డి. తనలాగే పాలూ, పెరుగు అమ్ముకునే దోస్తు దుర్గయ్య యాదవ్ తో కలిసి మొదట బోయినపల్లిలో చదువుల వ్యాపారం లోకి దిగారు. క్రైస్తవులు నడపలేకపోతున్న హై స్కూలును కొని గాడిలో పెట్టారు. తరవాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టి నాలుగు రాళ్లు కూడబెట్టారు. తెలుగు పాత్రికేయులు సహా తనకు సాయపడిన సామాన్యులందరినీ…