సోనియా కుటుంబం.. ‘కన్నడ కట్టప్ప’ ఖర్గే.. బాహుబలితో పోలిక..!!
Nancharaiah merugumala:(Editor) ============================ సోనియా కుటుంబానికి ‘కన్నడ కట్టప్ప’ మల్లికార్జున ఖర్గే ………………………. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు మాపన్న మల్లికార్జున ఖర్గే ‘బాహుబలి’ లోని కట్టప్ప లాంటోడు అని హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ జర్నలిస్ట్ చంద్ర ప్రకాశ్ పాండేయ అభివర్ణించారు. ఈ వీరవిధేయ ‘మల్లన్న’ ఐదుగురు సంతానంలో ముగ్గురు పేర్లు- రాహుల్, ప్రియాంక్, ప్రియదర్శిని అని ఈ ఉత్తరాది బ్రాహ్మణ పాత్రికేయుడు పాండేయ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పిల్లల పేర్లు జయశ్రీ, మిలింద్….