దేశంలో కరోనా కల్లోలం!
దేశంలో కరోనా థర్డ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా గురువారం ఒక్కరోజే 90 వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 2 వేల 630కి పెరిగాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 36,265 కరోనా కేసులు వెలుగు చూడగా.. ఒక్క ముంబయిలోనే 20,181 కేసులు నమోదయ్యాయి. 8,907 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ధారావిలో కొత్తగా 107 కేసులు వెలుగు చూశాయి.మరోవైపు వందకు చేరువలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో…