Telangana :విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ చెల‌గాటం : ఎస్ఎఫ్ఐ

Atmakur: విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంద‌ని ఆత్మకూర్ మండల ఎస్ఎఫ్ఐ అధ్య‌క్షులు చరణ్ ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం మండలంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో విద్యాసంస్థల బంద్ చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. గత నెల రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ‌ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాల‌వ‌డం.. చనిపోతూ ఉంటే ఎమ్మెల్యేలు ప‌ట్టింపులేన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం సిగ్గుచేట‌న్నారు. వరుస ఘటనలతో విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ త‌క్ష‌ణ‌మే విచార‌ణకు…

Read More

Telangana: త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన..!

• త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన •  నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్న కమిషన్  • వచ్చే నెల రెండో వారంలో ముగియనున్న గడువు రాపర్తి వినోద్: ఎస్సీల్లో అట్టడుగు స్థాయిలో ఉండి వినతులు అందించలేని వారికోసం చొరవ చూపించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ కోరింది. త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో  పర్యటన ఉండబోతుందని తెలిపింది. అన్ని వర్గాల నుంచి వినతులు సేకరించిన తర్వాత వారిలో ఒకే…

Read More

Telangana: సీఎం రేవంత్ నాయకత్వాన్ని అస్థిరపరిచే కుట్ర: పటేల్ రమేష్ రెడ్డి

Telangana:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ లగచెర్ల లో కలెక్టర్ పై దాడి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్ది అమాయక ప్రజలను రెచ్చగొట్టారని.. కేటీఆర్…

Read More

Telangana: అయోధ్య, అలీగఢ్‌ కన్నా ఎక్కువ ‘సెన్సిటివ్‌’ అని నిరూపించిన ‘ కొడంగల్ ‘ గ్రామం లగచర్ల..!

Nancharaiah merugumala senior journalist: భోగమోని సురేశ్‌ అనే యువకుడికి ఎక్కడ లేని విస్తృత ప్రచారం!కలెక్టర్‌ కారద్దాలు పగిలితే కరంటు ఆగింది, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి! ఉత్తరాది, మణిపూర్‌తో పోల్చితే..తెలంగాణ సర్కారు ‘హైపర్‌ సెన్సిటివ్‌’ అయింది. తెలంగాణ రాష్ట్రం–వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, రెవెన్యూ అధికారులపై స్థానిక ఊళ్ల జనం జరిపిన దాడిలో ఒక్కరూ కన్నుమూయ లేదు. ఎవరి తలా పగల్లేదు. ఏ ఒక్కరి కాలూ విరగ…

Read More

Bandisanjay: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే: బండి సంజయ్

Bandisanjay: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను…

Read More

Musirevival: మూసీ పునరుజ్జీవనంతో బాధెవరికి? మేలెవరికి?

Musi riverfront: నదుల వెంట నాగరికత విలసిల్లిందని మానవ వికాస చరిత్ర చెబుతోంది. నగరాలు నరకకూపాలై నదులను విషతుల్యం చేయడం మన కళ్లముందరి ఆధునిక వాస్తవం. పరిశ్రమల విషరసాయనాలు, మానవ వ్యర్థాలు, ఇతర మురుగుతో కాలుష్యమైన మూసీ దేశంలోనే అత్యంత విషపూరితమైన నదిగా, ప్రపంచంలోని పాతిక అతి కాలుష్య నదుల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రాజధాని హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే ఈ ప్రకృతి జల సంపదను దశాబ్దాల నిర్లక్ష్యంతో నాశనం చేసుకున్న హీనచరిత్ర మనది. దిగువ గ్రామీణ…

Read More

Telangana: తెలుగువర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలన్న వైశ్యుల డిమాండ్‌ న్యాయమే కదా?

Nancharaiah merugumala senior journalist: ఇండియాలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పిడికి వివాదాలు లేదా గొడవలు పూర్వపు హైదరాబాద్‌ స్టేట్, ప్రస్తుత మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని ఔరంగాబాద్‌ మరాఠ్వాడా యూనివర్సిటీతో మొదలు కాలేదు, దానితోనే ముగియడం లేదు. ఈ యూనివర్సిటీకి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాని దళితులు ఆందోళన చేయడం, ససేమిరా అలా చేయోద్దంటూ శివసేన, మరాఠా కులాల సంస్థలు పోటీ ఉద్యమాలు నడపడం, ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం…

Read More

Nconvention: ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె..!

Nancharaiah merugumala senior journalist: నాడు అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎన్టీఆర్‌ నోటీసులతో ఏఎన్నార్‌కు గుండెపోటు..నేడు ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె! కొన్న స్థలం నుంచి ప్రజల సంపదలో భాగమైన చెరువులోకి చొరబడి నిర్మాణం చేశారనే కారణంపై హైదరాబాద్‌ ఐటీ కేంద్రం మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ అనే కొన్నెకరాల విస్తీర్ణంలో కట్టిన భవనాలను తెలంగాణ సర్కారు శనివారం కూల్చేస్తోందనే వార్తలు వేగంగా వచ్చిపడుతున్నాయి. దీని యజమాని దివంగత తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున…

Read More

Kerala: 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం

Nancharaiah merugumala senior journalist: రేవంత్ రెడ్డేమో మోదీని మొన్న పెద్దన్న అని పొగిడితే ఇప్పటికే 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం విజయన్  ‘‘బీజేపీలోకి ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రులు చేరిపోయారు. ఇంకెందరు హస్తం పార్టీ మాజీ సీఎంలు బీజేపీలో జొరబడతారు? ఎవ్వరూ ఈ విషయంపై జోస్యం చెప్పలేరు. మీరెవరైనా చెప్పగలరా? ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితి. మరోపక్క మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చిన బీజీపీ ప్రధాని నరేంద్రమోడీని…

Read More

Revanthreddy: రేవంత్‌ మార్క్సిస్టుల జోలికి అనవరంగా పోకపోతేనే మంచిది.

Nancharaiah merugumala senior journalist:  ” కేరళ కాంగ్రెస్‌ సమరాగ్ని సభలో రేవంత్‌ మాట్లాడితే ఒక్క ఈనాడే వార్త వేసింది!అవినీతి, ప్రతిపక్షాల అణచివేత ఎలా చేయాలో కేసీఆర్‌ దగ్గర మార్క్సిస్ట్‌ సీఎం విజయన్‌ నేర్చుకున్నారని చెప్పడం తెలంగాణ యువ సీఎం అమాయకత్వం కాదా?  “ గురువారం హైదరాబాద్‌ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం పోయి అక్కడ కాంగ్రెస్‌ సమరాగ్ని ప్రజాందోళన బహిరంగ సభలో ప్రసంగించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి. కేరళలో 2016 నుంచి అధికారంలో…

Read More
Optimized by Optimole