తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ విమానం!

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఊటి దగ్గర చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలకాప్టర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఇందులో మొత్తం 14 మంది ఆర్మీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హెలికాప్టర్ ప్రమాదాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన సమయంలో రావత్ హెలికాప్టర్ లో ఉన్నట్లు తెలిపింది. ప్రమాదం జరగడానికి గల కారణంపై…

Read More

భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం!

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై నగరం జలమయమైంది. చెన్నై, పుదుచ్చేరి నగరాలతో పాటు తిరువల్లూర్, రాణిపేట్, వెల్లూర్, తిరుపత్తూర్, తిరువనమలై, కల్లకురిచి, సాలెంలో వరద బీభత్సం కొనసాగుతోంది. విల్లుపురం, కుడలోర్, క్రిష్ణగిరి, ధర్మపురి, నమక్కల్, పెరంబలూర్, అరియలూర్ లోనూ జనం అవస్థలు పడుతున్నారు. వరదనీటికి తోడు మురుగునీరు ఇళ్లల్లోకి చేరి జనం నరకం చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని హాస్పిటళ్లు, ఆఫీసులు జలమయమయ్యాయి. రోడ్లపై 2 నుంచి 3…

Read More

కరోనా తో మరో సింహం మృతి!

కరోనాతో మరో సింహం చనిపోయింది. చెన్నైలోని వాండలూర్‌ అన్నా జూపార్కులో కరోనాతో 12ఏళ్ల ఆసియా మగ సింహం.. బుధవారం మరణించినట్లు జూ అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్​గా తేలిన తర్వాత అత్యవసర విభాగంలో ఉంచి.. మృగరాజుకు చికిత్స అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక సింహానికి కరోనా లక్షణాలు కనిపించగా.. జూలోనే పరీక్షలు నిర్వహించినట్లు పశువైద్య అధికారులు తెలిపారు. నమూనాలను మధ్యప్రదేశ్​ భూపాల్​లోని ఎన్​ఐహెచ్​ఎస్​ఏడీకి పంపినట్లు తెలిపారు.మొత్తం 14 సింహాల్లో ఏడు కరోనా బారిన పడ్డాయి. వారం వ్యవధిలో…

Read More

అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది: ఖుష్బూ

బీజేపీ పై విమర్శలు చేసిన వారికి నటి కుష్బూ తనిదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకొని వికసించదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించలేదంటూ విమర్శలు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఖాతా తెరవని పార్టీ, ఈసారి నాలుగు స్థానాలు గెలుచుకుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, రానున్న రోజుల్లో అధికారంలోకి కమలం పార్టీ రావడం ఖాయమని…

Read More

శశికళ సంచలన నిర్ణయం!

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నా డీఎంకే బృహిష్కృత నాయకురాలు శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఏనాడు అధికారంపై మోజు లేదని, జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. డీఎంకే కుటుంబపాలనలకు స్వస్తి చెప్పి అమ్మ పాలన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళ నాలుగేళ్ల…

Read More
Optimized by Optimole