ఢిల్లీని చిత్తుచేసిన రాజస్ధాన్.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు మరోసారి అదరగొట్టింది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో రాజస్థాన్​ జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్‌ (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. ఓపెనర్లు బట్లర్ సెంచరీ.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్ (46) మెరుపు…

Read More

చెన్నైని గెలిపించిన ధోని!

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై జట్టు ముంబై పై గెలిచింది. మరోవైపు ఈ మ్యాచ్​తోనైనా టోర్నీలో బోణీ కొట్టాలని భావించిన ముంబయికి చుక్కెదురైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ జట్టులో తిలక్‌ వర్మ (51) అర్ధశతకం మెరిశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (32), హృతిక్‌ షోకీన్‌…

Read More

అదరగొట్టిన వార్నర్.. ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!

ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఓకే వికేట్ కోల్పోయి సాధించింది. దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. ఢిల్లీ బౌలర్ల ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. అజట్టులో కెప్టెన్ మయాంక్‌ అగర్వాల్ (24), జితేష్ శర్మ (33) మినహా మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. దిల్లీ బౌలర్లలో…

Read More

తీరుమారని ముంబై..లఖ్నవూ చేతిలో ఓటమి!

ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్​ రాత మారలేదు. శనివారం లఖ్​నవూ చేతిలో జరిగిన ఆరో మ్యాచ్లోనూ ముంబై జట్టు18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​ చేసిన లఖ్​నవూ.. కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20ఓవర్లలో 199 పరుగులు చేసింది. మనీశ్ పాండే, క్వింటన్ డికాక్ ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా.. మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ తలా ఓ…

Read More

కోల్కతా చిత్తు..హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలను దూసుకెళ్తోంది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన పోరులో 176 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే చేధించి.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఆ జట్టులో నితీష్ రాణా (54) అర్ధసెంచరీ తో ఆకట్టుకోగా.. రసేల్ (49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్‌ మాలిక్ 2…..

Read More

ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హవా.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్‌ 2022లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. గురువారం రాజస్థాన్ తో జరిగిన పోరులో గుజరాత్ జట్టు 37 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (87 : 52 బంతుల్లో 8×4, 4×6) అర్ధ శతకంతో మెరిశాడు. అభినవ్ మనోహర్ (43 : 28…

Read More

ఎట్టకేలకు బోణీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (75) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా చెన్నై జట్టుకు ఈ సీజిన్లో వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత…

Read More

కమిన్స్ విధ్వంసం.. కోల్ కత్తా ఘన విజయం!

ఐపీఎల్ తాజా సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో.. ముంబయి నిర్దేశించిన 162పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించి కోల్ కత్తా జట్టు 5 వికెట్లు తేడాతో గెలుపొందింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 161 పరుగులు చేసింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ (52 : 36 బంతుల్లో) అర్ధ శతకంతో మెరిశాడు. తిలక్ వర్మ (38 : 27 బంతుల్లో ), డెవాల్డ్…

Read More

పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు.. టోర్నీలో వరుసగా మూడో ఓటమి!

ఐపీఎల్ 15 వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 126 పరుగులకే చెన్నై చేతులెత్తేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టులో చలియామ్ లివింగ్ (60) స్టోన్ హాఫ్…

Read More

చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్​ 2022లో టోర్నీలో వరుస ఓటములతో సతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి గుడ్ న్యూస్. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ త్వరలో జట్టులో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అతడు నెట్​ ప్రాక్టీస్​ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా అతనిని చెన్నై జట్టు వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత సీజన్లో చెన్నై జట్టు విజేతగా నిలవడంలో దీపక్…

Read More
Optimized by Optimole