తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు బీజేపీదే: బండి సంజయ్
BJPTelangana: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలే నిదర్శనమన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాదిమంది నిరుద్యోగులు, ఏఎన్ఎంలపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ చెన్నమనేని వికాస్, చెన్నమనేని దీప దంపతులు బీజేపీలో…