Maghamasam: శివుడికి అత్యంత ఇష్టమైన మాసం..ఇలా చేస్తే సకల శుభాలు…!
Maghamasam: మాఘమాసం శివుడికి అత్యంత ఇష్టమైన మాసం. మాఘం అనగా యజ్ఞం. యజ్ఞం యుగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ఈ మాసంలో క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈమాసంలో మాఘస్నానం పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదిస్నానాలు చేయడం మాఘమాసం సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నానం మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నానం పుణ్యఫలమే మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మాఘమాసంలో…
