రాజకీయ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ : భీశెట్టి బాబ్జి
APpolitics: తమను ఆరాధించే కార్యకర్తలే ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నాయకులు ‘యూ’ టర్నులు తీసుకుంటున్నారు.పూటకో నాటకం ఆడుతున్న వారి స్వార్థ రాజకీయాలను చూసి వారి అభిమానులకు ఏమీ పాలుపోవడం లేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ‘బీ’ టీమ్‌గా మారడం శోచనీయం. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ అంటే బీ-బాబు, జే-జగన్, పీ-పవన్ అనేలా అర్థం…