APpolitics: ‘‘బాబే మారెనా…? ప్రజలనేమారెనా??’’

APpolitics:  ‘మారింది మారింది కాలం…. మారింది మారింది లోకం… ఎక్కడ మారిందమ్మా…? ఇంకా దిగజారిందమ్మా…..!’ అనే సినీ గీతమొకటి  డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసింది తెలుగునాట బాగా ప్రసిద్ది. తాను మారానని, మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు నిజంగా మారారా? నమ్మడానికి మన మనసు అంత తేలిగ్గా అంగీకరించదు. ఎందుకంటే, ఇది ఆయన కన్నా, ఇతరులు చెబితేనే నమ్మాలి. కానీ, ఇప్పటివరకు ఇతరులెవరూ ఆ ముక్క చెప్పట్లేదు. ఆయనే చెబుతున్నారు. ‘మారిన చంద్రబాబును…

Read More

Rahulgandhi: రాహుల్‌ కి ముత్తాత నెహ్రూ జీ సాలు వస్తే మరో మూడేళ్లలో ప్రధాని పదవి!

Nancharaiah merugumala senior journalist:  కాంగ్రెస్‌ ఏకైక అగ్రనేత రాహుల్‌ గాంధీకి బుధవారం 54 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ముత్తాత (‘గ్రేట్‌’ గ్రాండ్‌–ఫాదర్‌!) పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ 57 ఏళ్ల ఆర్నెల్ల వయసు దాటాక భారత తొలి ప్రధానిగా (అది తాత్కాలిక జాతీయ ప్రభుత్వమే గాని పదవి పదవే కదా!) 1947 ఆగస్టు అర్థరాత్రి పదవిని చేపట్టారు. ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ 1984లో అక్టోబర్‌లో 40 సంవత్సరాల వయసులో భారత ప్రధాని అయ్యారు. తల్లి…

Read More

Ramojirao: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌..ఒడిశా ఎమ్మెల్యే మద్దతు..!

Nancharaiah merugumala senior journalist: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌ కమ్మ మాజీ ఎంపీ నుంచి ఒడిశా తెలుగు యాదవ ఎమ్మెల్యే వరకూ మద్దతు..! ‘ఈనాడు’ స్థాపకుడు చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూసి 10 రోజులు దాటక ముందే ఈ దివంగత తెలుగుతేజానికి దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలనే డిమాండు ఊపందుకుంటోంది. మొదట ఆదివారం హైదరాబాద్‌ అమీర్‌ పేట కమ్మసంఘం హాలులో తెలుగు కమ్మ ప్రముఖులు జరిపిన సంతాపసభలో రాజమండ్రి మాజీ ఎంపీ, కమ్మ వ్యాపారవేత్త…

Read More

‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలి: లోక్ సత్తాభీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ

Apnews:  ‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ కి లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరగానే ‘‘అన్న క్యాంటిన్ల’’ ను ఏర్పాటుకి సంబంధించిన ఫైల్స్ పై సంతకం చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. పేదల ఆకలి తీర్చడానికి ప్రారంభిస్తున్న క్యాంటిన్లకు స్వర్గీయ నందమూరి తారకరామారావు (అన్నగారు) పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. క్యాంటిన్లకు ‘‘అన్న…

Read More

Rahulgandhi: ప్రియాంక- రాహుల్‌ మాదిరి..షర్మిల, జగన్‌ మధ్య ‘ అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..!

Nancharaiah merugumala senior journalist: ” ప్రియాంక వారణాసిలో పోటీచేస్తే మోదీ ఓడిపోయేవారన్న రాహుల్‌.. ! షర్మిల, జగన్‌ మధ్య కూడా ఇలాంటి ‘అన్నాచెల్లెళ్ల అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..! “ చెల్లి ప్రియాంకపై అన్న రాహుల్‌ కు ఈ విశ్వాసం మార్చి 16కు ముందు ఉండి ఉంటే.. కాంగ్రెస్‌ లోక్‌ సభలో సెంచరీ మిస్సయ్యేది కాదేమో. తమ కుటుంబ ‘పాత సొంత’ నియోజకవర్గం అమేఠీలో కాంగ్రెస్‌ అభ్యర్ధి కిశోరీలాల్‌ శర్మను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు చెప్పడానికి మంగళవారం…

Read More

Gvl: ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి?

Nancharaiah merugumala senior journalist: ” మెదడును సరిగ్గా వాడుకుని బాబు కేబినెట్లో మంత్రి దాకా ఎదిగిన ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి? “ మొన్నటి ఏప్రిల్‌ నెల వరకూ సత్యకుమార్‌ యాదవ్‌ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్‌ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్‌ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే…

Read More

Ramojirao: రామోజీ గారు అన్న మాటలివి..!

Nancharaiah merugumala senior journalist: ‘ ఫస్ట్ పుట్ ద పేపర్స్ ఆన్ మై టేబుల్ ‘…2007లో కలిసినప్పుడు రామోజీ గారు అన్న మాటలివి  ‘ఈనాడు’ సంస్థల్లో నేనెప్పుడూ రెగ్యులర్‌ ఉద్యోగిని కాదు, వారి పేరోల్స్‌ లో ఎన్నడూ లేను. ఇప్పుడు బతికి ఉన్నదో లేదో చెప్పడానికి వీలులేని తెలుగు డైలీ ‘వార్త’లో ఏ నెల జీతం ఏ తేదీన వస్తుందో తెలియని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నాకు– 2003లో ఆగస్టులో ఈనాడు జర్నలిజం స్కూల్‌ (ఈజేఎస్‌)లో…

Read More

Ramojirao:ఆయనో శిఖరం..చేసిందో యజ్ఞం..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: ‘మీరు ముఖ్యమంత్రి కావాలి సార్‌’ ఎంతో ఉత్సుకతో తన మనసు వెల్లడించిన ఓ సీనియర్‌ సబ్‌ఎడిటర్‌కి, తడుముకోకుండా బదులిచ్చారాయన. ‘ఏమయా, నేనిపుడు ఓ ముఖ్యమంత్రికన్నా తక్కువటయ్య?’ అని మనసారా నవ్వుతూ పలకడంతో ‘ఈనాడు’ ఎడిటోరియల్‌ నెలవారీ సమీక్ష సమావేశంలో నవ్వులు విరిసాయి. నిజమే, పలువురు ముఖ్యమంత్రులు గద్దెనెక్కడం, దిగడంలో అప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర పోషించిన మీడియా మొగల్‌ రామోజీరావు. పొద్దుపొడుపుకు ముందే వాకిట వచ్చి వాలే… ఈనాడుతో తెలుగునాట ఒక…

Read More

Annamalai: అన్నామలై ఎందుకు ఓడిపోయారు?

సాయి వంశీ ( విశీ): ఆయనో ఇంటర్‌నెట్ సెన్సేషన్. మాజీ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రంలో కమలదళ అధ్యక్షుడు. ఆయన పేరు చెప్తే యూత్ అంతా ఉర్రూతలూగిపోతారు‌. దక్షిణాదిలో కమలదళానికి బలమైన యువశక్తి. తమిళనేలపై ఆ పార్టీకి ఆయనే వెన్నుదన్ను. అయినా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు ఎంపీ కాలేకపోతున్నారు? ఆయనే అన్నామలై. అన్నామలై కుప్పుసామి. 2024 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1.18 లక్షల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు….

Read More

Ayodhya: అయోధ్యలో కమలం ఎందుకు వికసించలేదు?

సాయి వంశీ ( విశీ) :  నిజమే! మొత్తం దేశానికి ఇదొక ప్రశ్న. రామమందిరం కట్టారు, బాలరాముణ్ని ప్రతిష్టించారు, ఊరూవాడా ఏకం చేసి సంబరాలు చేశారు. అయినా అక్కడ కమలం వికసించలేదు. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబా‌ద్‌ ఎంపీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ 54,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంత భారీ ఆధిక్యంతో విజయం సాధించడం చిన్న విషయం కాదు. అసలు ఏం జరిగింది? కమలలోచనుడు ఎందుకు కమలం మీద శీతకన్నేశాడు? నిజానికి…

Read More
Optimized by Optimole