Congress: ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి..!

Exitpolls2024:  ” పోల్ బాయకాట్ చేయకుండా… ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? ”  ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ముందు రాజకీయ పరిస్థితులు సజావుగా లేవని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇచ్చేవిగా ఈసీ పోకడలు కనిపించడం లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ అసలు పోల్ బాయకాట్ ప్రకటించాల్సింది. ఎందుకో అంతటి గొప్ప సాహసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీఓపీ) చేయలేదు. కానీ శనివారం సాయంత్రం అన్ని మీడియా వేదికల…

Read More

Ambedkar: అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది!

Nancharaiah merugumala senior journalist: ‘గాంధీ’ సినిమాతో మోహన్‌ దాస్‌ గాంధీకి ‘అంతర్జాతీయ గుర్తింపు’ వచ్చిన మాట ఎంత వరకు నిజమోగాని–బాబాసాహబ్‌ అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది! ప్రధాని నరేంద్రమోదీ ఏబీపీ న్యూస్‌ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు –మహాత్మా మోహన్‌ దాస్‌ గాంధీకి ‘ప్రపంచవ్యాప్త గుర్తింపు’ 1982లో ‘గాంధీ’ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మాట ఎంత వరకు నిజమో గాంధీ ఇంటి పేరున్న రాహుల్‌…

Read More

YsJagan: 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుర్తుచేసిన రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ

Nancharaiah merugumala senior journalist:  ” 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుండెలు పిండేసేలా గుర్తుచేసినందుకు వేమూరి రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ అభిమానులు.. ”  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్కర కాలం క్రితం 2012 మే 12న అరెస్టయ్యారనే విషయం సోమారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనే తెలుగు టెలివిజన్ న్యూజ్ ఛానల్ గుర్తుచేసింది. పాత కతలు చాలా వరకు విసుగుపుట్టించే స్థాయిలో రాసే అలవాటున్న నాకు జగన్ ను సీబీఐ…

Read More
tdp,janasena,bjp,

APpolitics : ఏపీలో కూటమిది గాలా?…. తుఫానా..?

APpolitics: ‘వీచింది గాలా? వచ్చింది తుఫానా?’ తనను కలిసిన ఆంధ్రప్రదేశ్‌ నాయకులతో ప్రధానమంత్రి, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ ఆరా తీసిన తీరు ఇది! ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అనుకూలంగా గాలి వీచిందని… అది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వారు ఆయనకు చెప్పినట్టు తెలిసింది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ‘‘గాలా..? తుఫానా..?’’ అని అడిగారంటే, ఆయనకు విశ్వసనీయ వ్యక్తులు, సంస్థల నుంచి ముందే అందిన సమాచారాన్ని సరిపోల్చుకోవడానికేనని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రాజకీయ గాలీ…

Read More

Modi: 2047 వరకు ప్రధానిగా మోదీ..97 ఏండ్లు బతకడం కుదరదేమోననే అనుమానం ఎందుకో!

Nancharaiah merugumala senior journalist: ” తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీ ‘స్వమూత్రపాన చికిత్స’తో 99 ఏళ్లు జీవించగా లేనిది రెండో గుజరాతీ పీఎం 97 ఏండ్లు బతకడం కుదరదేమోననే అనుమానం ఎందుకో! “ తొలి గుజరాతీ ప్రధానమంత్రి మొరార్జీ దేసాయి 81 సంవత్సరాలు నిండిన నెల తర్వాత 1977 మార్చి 24 దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. సంక్షుభిత భారత రాజకీయాల మధ్య కేవలం రెండేళ్ల 4 నెలలు ప్రధాని గద్దెపై కూర్చోగలిగారు సంపూర్ణ శాకాహారి…

Read More

Apolitical: ఎన్నికల్లో ‘నెటిజన్స్’ ఎవరి వైపు?

Social media: మన దేశ జనాభాలో 66 శాతం 35 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారత్. మిలీనియల్స్, జెన్ జీ గా పరిగణించే వీరిలో 98 శాతం మంది స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. వీళ్లు రోజూ కనీసం ఒక్క వీడియో అయినా చూసే జాబితాలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా స్మార్ట్ గా తయారయ్యాయి. సంప్రదాయ…

Read More

AP election: ఆమె ఒక మామూలు లేడీయా?

సాయి వంశీ ( విశీ) :  “పవన్ కల్యాణ్‌కి ఎదురుగా మాములు లేడీ ఎలా గెలుస్తుంది బ్రో? జనం వైసీపీని, జగన్‌ని చూసి ఆమెకు ఎన్ని ఓట్లు వేస్తారు? పిఠాపురంలో ఇంకా గట్టి క్యాండిడేట్‌ని పెడితే ఏమన్నా వర్క్‌వుట్ అయ్యేదేమో? పక్కా పవనే గెలుస్తాడు చూడు!” అన్నాడో మిత్రుడు. ఆంధ్ర రాజకీయాల మీద అతనికి పెద్దగా అవగాహన లేదు. ‘పక్కా పవనే గెలుస్తాడు’ వరకూ నాకు అభ్యంతరం లేదు. అది అతని ఆశ, అభిప్రాయం. రేపు ఎవరు…

Read More

Nadendla: ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది: నాదెండ్ల మనోహర్

APPOLITICS:  ‘ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడు. అలాంటి ఓటరుని గౌరవించుకోకపోతే ఎలా? పోలింగ్ బూత్ దగ్గర స్వయానా ఓ శాసన సభ్యుడు ఓటరుపై చెయ్యి చేసుకోవడం దారుణం. తెనాలిలో జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుని ముక్తకంఠంతో ఖండిస్తున్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని, లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లోనే ఉంది అనుకుంటే పొరపాటన్నారు. ఓటమి ఖాయమవడంతో సహనం…

Read More

pawankalyan: కాశీ చేరుకున్న చంద్రబాబు, పవన్ ఎవరికి పిండాలు పెట్టడానికో!

Nancharaiah Merugumala senior journalist:  తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు కానీ, ఎందరో పెద్ద పెద్ద ఆంధ్రా లీడర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు భీమవరం రెడ్లబ్బాయి గొలుగుమూరి సత్యనారాయణ రెడ్డి మామ రేవంత్.. మొదట కేరళ వయనాడ్ నుంచి, తర్వాత మొన్న యూపీలోని రాయ్ బరేలీలో నామినేషన్ వేసిన రెండు సందర్భాల్లో రెవంతయ్య అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన ప్రత్యక్షమయ్యారు. రేవంత్ చేసిన పనిలో తప్పేం…

Read More

పక్కదారి పట్టిన ప్రచారం

నేను రెండో క్లాస్‌లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్‌ని ఒక విషయం అడిగినప్పుడు ‘గాడిద గుడ్డు’ అని విసుక్కున్నారు. అప్పుడు నాకు గాడిద గుడ్డు పెడుతుందా..? అనే సందేహం వచ్చింది. చిన్నతనంలో నాకు వచ్చిన సందేహమే ప్రస్తుతం నా పిల్లలకు కూడా వచ్చింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇప్పుడు ‘గాడిద గుడ్డు’ తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణలో మూడోసారి హోరాహోరీగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం పరాకాష్టకు…

Read More
Optimized by Optimole