రాజకీయ పార్టీల్లో ముదురుతున్న లోల్లులు..

telanganapolitics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో..?లేదో..? తెలియని పరిస్థితి.  ఎన్నికల నిర్వాహణ సంస్థ ‘‘ఎన్నికల సంఘం’’లో ఉలుకుపలుకు కనిపించడం  లేదు.  తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్లుగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ 115 అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలు చేయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తొందర పడుతున్నాయి. టీకెట్ల ప్రకటన అనంతరం బీఆర్‌ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో మొదలైన లొల్లి తుమ్మల నాగేశ్వర్‌రావు వరకు పాకింది.నేటికి అధికార పార్టీ ఆశావాహుల్లో టికెట్లు రాలేదన్న…

Read More

తెలంగాణ తల్లి కోసం గొంతెత్తుదాం..

IncTelangana: సమాజంలో మీరు చూడాలనుకున్న మార్పులో ముందు మీరు పాత్రధారులు కావాలి అన్న మహాత్మ గాంధీ మాటల ప్రేరణతో యువతలో అసలైన పార్లమెంటేరియన్‌ను మేల్కొలిపే ప్రయత్నం మొదలుపెట్టామని కాంగ్రెస్ సిటిజన్ యూత్ పార్లమెంట్ వింగ్ పేర్కొంది. ఈ మార్పు, పరివర్తనలో యువతను మరింత శక్తివంతం చేసేందుకు సిటిజన్ యూత్ పార్లమెంట్ ఒక వేదికగా మారుతుందని.. మొదటి ఎడిషన్ కర్ణాటకలో విజయవంతంగా పూర్తి చేసి.. ఇప్పుడు తెలంగాణాలో 2వ ఎడిషన్ తీసుకొస్తున్నామని తెలిపింది. యంగ్ స్టేట్‌లో ఈ ఎడిషన్‌ను…

Read More

జమిలి ఎన్నికల’ పై మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు బహిరంగ లేఖ..

Hyderabad: జమిలి ఎన్నికల’ పై మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాష్ రావు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో అకస్మాత్తుగా  ‘జమిలి ఎన్నికలు’ గురించి  హడావుడి చేయడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు .బుధవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా  ప్రకాశ్ రావు మాట్లాడుతూ..నిజంగా ఎన్నికల వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య ప్రక్రియలో సంస్కరణల…

Read More

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పటేన్ల పటాతోపం..

బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలుగు రాష్ట్రాల్లో ‘‘రెడ్డి రాజుల’’ పాలన కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల్లో లభించిన శాసనాల్లో రెడ్డి రాజుల చరిత్ర వెలుగులోకి వచ్చింది. నది పరివాహక ప్రాంతాలను అసరా చేసుకొని సాగిన రెడ్డి రాజుల పాలనలో సాహసోపితమైన నిర్ణయాలు, వ్యవసాయ అభివృద్ది జరిగిందని చెబుతారు. ఆ నాటి నుంచి బలపడుతూ వస్తున్న రెడ్డిలు (పటేన్లు) ప్రస్తుత రాజకీయాల్లో కూడ అధిపత్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబరుస్తు వస్తున్నారు. ఆరు…

Read More

బాలెం గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్: ప్రిన్సిపల్ శైలజ

Suryapeta: సూర్యాపేట:బాలెంల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో  2023 – 24 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు  ప్రిన్సిపాల్ డాక్టర్  పి. శైలజ  ఓ  ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం.పి.సి, ఎం.ఎస్.డి.ఎస్. బి.కాం జనరల్,బి జెడ్ సి,ఎం జడ్ సి సబ్జెక్ట్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2022 – 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన  ఎస్సీ…

Read More

నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు..

Hyderabad:  నవ్యనాటక సమితి 48వ ఆల్‌ ఇండియా మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ పోటీల ముగింపు కార్యక్రమాలు రవీంద్రభారతిలో శనివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. నవ్యనాటక సమితి సంస్థ నిరాటంకంగా ప్రతి సంవత్సరం కళాకారులను ప్రోత్సాహిస్తూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.  వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించిడమే నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో ఉన్న ప్రత్యేక…

Read More

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు బీజేపీదే: బండి సంజయ్

BJPTelangana: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.  కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలే నిదర్శనమన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాదిమంది నిరుద్యోగులు, ఏఎన్ఎంలపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  డాక్టర్ చెన్నమనేని వికాస్, చెన్నమనేని దీప దంపతులు బీజేపీలో…

Read More

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు : మంత్రి జగదీష్ రెడ్డి

Telangana: సోదరభావానికి నిలువెత్తు నిదర్శనమే రాఖీ పౌర్ణమి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.భార‌తీయ సంస్కృతి, సాంప్ర‌దాయాల్లో గొప్ప ఆచారమ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య సోద‌ర‌భావం మ‌రింత‌గా ఫ‌రిడ‌విల్లాల‌ని  ఆకాంక్షించారు. సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని  పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా ప్రజల నడుమ సహోదర భావం మరింతగా…

Read More

తెలంగాణాలో రంజుగా రాజకీయం..

బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగ సభలతో వేడి పుట్టిస్తున్నాయి. బహిరంగ సభల్లో ప్రజలకు మేలు చేసే హమీల కన్నా.. ఒకరిపై మరోకరు బురద చల్లడమే పనిగా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చేవేళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లెరేషన్‌ పేరుతో సభ నిర్వహించగా.. పట్టులేని ఖమ్మంలో రైతు గోస.. బీజేపీ భరోసా పేరుతో కాషాయం పార్టీ బహిరంగ సభ…

Read More

బాలెం గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ : ప్రిన్సిపల్ శైలజ

సూర్యాపేట:బాలెంల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో  2023 – 24 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్  శైలజ  ఆదివారం ఓ  ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం.పి.సి, ఎం.ఎస్.డి.ఎస్. బి.కాం జనరల్  సబ్జెక్ట్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2022 – 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన  ఎస్సీ విద్యార్థినిలు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సోమవారం(ఆగస్ట్ 28…

Read More
Optimized by Optimole