×
In

కొత్త త్రిదళాధిపతిని ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. త్రివిధ దళాల సిఫారసు మేరకు అర్హుల జాబితాను త్వరలోనే రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​కు అధికారులు అందజేయనున్నారు. హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్ వారసుడ్ని ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేన సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్​ను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది.
మరోవైపు కొత్త సీడీఎస్​గా ఎంపికయ్యే అవకాశాలు సైన్యాధిపతి జరనల్ ఎంఎం నరవణెకే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవంలో అందరికన్నా సీనియర్ కావడం వల్ల ఈ పదవి దాదాపు ఆయనకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్​గా జనరల్​ బిపిన్​ రావత్​ నుంచి 2019 డిసెంబర్​ 31న నరవణె బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏప్రిల్​ వరకు ఆయన పదవీకాలం ఉంది. ప్రస్తుతమున్న వాయుసేన చీఫ్​ మార్షల్​ వివేక్​ రామ్​ చౌదరి ఈ ఏడాది సెప్టెంబర్​ 30నే బాధ్యతలు స్వీకరించారు. నౌకాదళ అధినేత అడ్మిరల్​ ఆర్​.హరికుమార్​ నవంబర్​ 30న ఆ బాధ్యతలను తీసుకున్నారు.
వీరిద్దరు ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించడం.. మరోవైపు అనుభవంలో అందరికన్నా సీనియర్ అయిన నరవణెకే ఈ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిదళాధిపతుల ఎంపికకు అనుసరిస్తున్న విధానాన్నే సీడీఎస్​ ఎంపిక విషయంలోనూ కేంద్రం పాటించనుంది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all

Literature: Where Books Live, Civilization Breathes….

World Book Day: A home is not measured by its size, but by the books it holds. A society is not judged...

Read out all
dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all
Optimized by Optimole