నరేంద్రమోదీని కావిలించుకోడానికి రాహుల్ కి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
Nancharaiah merugumala (political analyst):నరేంద్రమోదీని పార్లమెంటులో కావిలించుకోడానికి రాహుల్ గాంధీకి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసే సందర్భంలో.. లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరోసారి ఆలింగనం చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీజీకి శుక్రవారం భారత సుప్రీంకోర్టు ఇచ్చింది. వాయనాడ్ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చిన్న కోర్టు తీర్పు అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మోదీతో పార్లమెంటు దిగువసభలో ‘కలబడే’ గొప్ప ఛాన్స్…
Nalgonda: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య..!!
నల్గొండ, జూలై 12: ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విషాదాన్ని నింపింది. చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన రూపని అఖిల్ (24) అనే యువకుడు బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వేతనం తక్కువగా ఉండటంతో ఏడాదిన్నర క్రితం ఊరికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత కొత్త ఉద్యోగం కోసం…
ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో ఫైనల్ కు అర్హత సాధంచిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్…
Ekdinpratidin: ఉద్యోగానికి వెళ్లిన అమ్మాయి.. ఇంటికెప్పుడు రావాలి?
Ekdin pratidinmovie: Camp Sasi గారు FB వాడుతున్న టైంలో ఒక పోస్ట్ రాశారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. “ఫైట్స్, డ్యాన్స్ సీక్వెన్స్ ఎవరైనా తీస్తారు. దర్శకుడి ప్రతిభ బయటపడేది Emotional Scenesలోనే. ఆ సన్నివేశాల్లో కెమెరా ఎక్కడ ఉంది, ఎడిటింగ్ ఎలా చేశారు, ఒకరు డైలాగ్ చెప్తుంటే మిగిలినవారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, రీరికార్డింగ్ ఎలా ఉంది.. ఇవన్నీ చాలా కీలకం. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు” అని రాశారు….
మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదు :బండి సంజయ్
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. “సారా స్కాంలో అరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణలో మానవ హక్కులను హరించి పోవడానికి కేసిఆర్ కారణమన్న సంగతి కవిత మరచిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేసి.. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నరని మండిపడ్డారు. నిజాలు రాసే…
Telangana: పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలి: రైతు సంఘం మండల అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ
Atmakur: పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని ఆత్మకూరు రైతు సంఘం మండల అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కందడి వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తుమ్మల సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలను అడ్డగోలుగా పెంచి రైతుల పై మోయలేని భారాలు పెట్టీ రైతుల నడ్డి విరుస్తుందని…
