ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్!

విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల నిలుపుదల విషయంలో ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. బుధవారం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి తో  సమావేశమైన, ట్విట్టర్  ప్రతినిధుల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్న ఖాతాలను మూసివేయాలని ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది. అయితే కొన్ని ఖాతాలను మాత్రమే నిలిపేసిన ట్విట్టర్ …..

Read More

ధోనిపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

టెస్ట్ కెప్టెన్సీ వీడ్కోలు సమయంలో.. అతను మాత్రమే మెసేజ్ చేశాడు:  గత కొంత కాలంగా ఫామ్ తో సతమతమవుతున్న టీంఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో దుమ్ములేపుతున్నాడు.  దీంతో కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తు పోస్టులు పెడుతున్నారు. టోర్నీకి ముందు అతనికి జట్టులో స్థానంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే సెలక్టర్స్ అతనికి నెలరోజులు విశ్రాంతి ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది. ఎట్టకేలకు జట్టులోకి వచ్చిన రన్…

Read More

నాపై కేసులు అసదుద్దీన్ కుట్ర : హీరా గ్రూప్ సిఈఓ నౌహీరా

మహిళా సాధికారత కోసం పోరాడుతున్న అందుకు మజ్లీస్ అధినేత ఓవైసీ తనపై కుట్ర పన్నారని హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ ఆరోపించారు. తన ఆస్తులను కాజేసేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నాడని, నోటీసులు సైతం ఇవ్వకుండా తనను ఇరవై తొమ్మిది రోజులు జైల్లో ఉంచారని హీరా ఆరోపించారు. హీరా గ్రూప్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. తమ గ్రూపులో పెట్టుబడి పెట్టినా ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానని ఆమె వెల్లడించారు. కాగా తనపై ఫిర్యాదు…

Read More

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.నిన్న ఏర్పడిన అల్పపీడనం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.

Read More

Telangana: సిపిఎం పార్టీకి విరాళాలు ఇచ్చి ఆదరించండి: వేముల బిక్షం

Atmakur:  ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న  సిపియం పార్టీకి విరివిగా విరాళాలు అందించి ఆదరించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ఓ ప్రకటనలో కోరారు. ప్రజా శ్రేయస్సు కై ఉద్యమాల ఊపిరిగా పోరాడుతున్న పార్టీని తమవంతు సహాయ సహకారాలు అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ పట్టణంలో డిసెంబర్ 15,16,17 తేదీలల్లో సిపిఎం 3వ జిల్లా మహా సభలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి బహిరంగ…

Read More

పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ ఎగ్జిట్ పోల్ ..తెలంగాణ కాంగ్రెస్దే..!

Telangana election: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు పరిస్థితులు ఒక్కసారిగా ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా మారడంతో హ్యాట్రిక్‌ విజయంపై ధీమా పెట్టుకున్న బీఆర్‌ఎస్‌  ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. పీపుల్స్‌పల్స్‌ సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య కంటే బీఆర్‌ఎస్‌ ప్రజల…

Read More

‘లవ్ స్టొరీ’ ఏప్రిల్ లో విడుదల!

యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ప్రేమ కథల చిత్రాదర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ సినిమా పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్…

Read More

కేసిఆర్ మరోసారి దళితులను మోసం చేశారు: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని మండిపడ్డారు.దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు…

Read More

Bandisanjay: భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..

Bandisanjay: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు.     సోమవారం నుండి విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడివలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపుతూ అమ్మవారిని సేవిస్తారు. బండి…

Read More
Optimized by Optimole