కేరళలో జికా వైరస్ విజృంభణ!

కరోనా సెకండ్ వేవ్ ముప్పు నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తన్నారు. మరో వైపు కేరళలో కొత్తగా వెలుగుచూసిన జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా..తాజాగా ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో జికా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. వ్యాధి సోకిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా…

Read More

కోవిడ్ బాధితుల డబ్బులు తిరిగి ఇప్పిస్తాం: వైద్య ఆరోగ్య శాఖ

కోవిడ్ బాధితుల నుంచి డబ్బులు దండుకుని ప్రభుత్వ ఆసుపత్రులపై చర్యలు ముమ్మరం చేశారు. హైకోర్టు సూచనల ఆధారంగా.. బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పిచ్చేందుకు కసరత్తు మొదలైంది. కరోనా రోగులకు చికిత్స పేరిట దోపిడీకి పాల్పడిన ఆసుపత్రులపై పది రెట్లు జరిమానా విధించాలని.. వాటిపై చర్యలు తీసుకోవడం కన్నా.. వసూలు చేసిన సొమ్మును బాధితులకు ఇప్పించాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ స్పందించింది. ఇప్పటికే రోగుల నుంచి 114 ఆసుపత్రులపై 185…

Read More

వారాహి యాత్రను విజయవంతం చేయండి : నాదెండ్ల మనోహర్

Janasena: జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టనున్న వారాహి యాత్రను పార్టీ శ్రేణులంతా కలసి విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  పిలుపునిచ్చారు. వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్  ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండల నాయకులతో కాసేపు ముచ్చటించారు. స్ధానిక సమస్యలపై చర్చించారు. మండల పరిధిలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల…

Read More

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి!

ఊహాగానాలకు తెరదించుతూ.. ముందునుంచి అనుకున్నట్లే తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని ఏఐసిసి నియమించింది. సీనియర్ నేతలు టి.జగ్గారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లతో పాటు అజారుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, రమేశ్‌ ముదిరాజ్‌,…

Read More

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అదృష్టం: రజినీకాంత్

2021 ఏప్రిల్ లో రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయంపై రజనీకాంత్ తనదైన శైలిలో స్పందించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తన అదృష్టమని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ట్వీట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంతోషకరమైన సమయంలో తన గురువు బాలచందర్ తనతో లేకపోవడం బాధాకరమని రజినీ అన్నారు.

Read More

అవినీతిపై ఉద్యోగి వినూత్న ప్రచారం.. సీనియర్ జర్నలిస్ట్ కౌంటర్…!!

సూర్యాపేట జిల్లాలో ఓప్రభుత్వ ఉద్యోగి అవినీతి పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పాలకీడు మండల తహశీల్దార్ ఆఫీస్ లో ఏఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య.. నాకు లంచం వద్దు అంటూ జేబుకు ఐడీ కార్డు పెట్టుకొని కార్యాలయానికి వచ్చారు. దీనిపై అధికారులు వివరణ అడగగా.. ఇటీవల కాలంలో తరుచూ ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల వస్తున్నాయని.. తాను మాత్రం లంచం తీసుకోను అని చెప్పేందుకే  ఐడి కార్డు పెట్టుకున్నానని నర్సయ్య సమాధానమిచ్చారు. అనంతరం మరో అధికారి.. మీరు…

Read More
Optimized by Optimole