బండ్ల గణేష్ తో రేవంత్ భేటి వెనక అంతర్యం..?
సినీ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా ? పీసీసీ అధ్యక్షుుడు రేవంత్ రెడ్డితో భేటి అవడానికి కారణం ఏంటి? బండ్ల కాంగ్రెస్లో చేరితే ఎక్కడ నుంచి పోటి చేస్తారు? రేవంత్ రెడ్డితో బండ్ల భేటి తర్వాత ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు! వీటన్నింటికి త్వరలో సమాధానం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినీ నిర్మాత బండ్ల గణేశ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో భేటి కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం బండ్ల గణేష్ నివాసంలో…
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్ దాఖలు..!!
presidentelection2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి పీసీ మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసేందుకు ఆమె వెంట ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రతిపాదించగా.. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదనను బలపరిచారు. ఇక నామినేషన్ కు ముందు…
‘షంషేరా’ ట్రైలర్ విడుదల.. భావోద్వాగానికి గురైన రణ్ బీర్!
shamshera Trailer: బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ద్విపాత్రిభినయంలో నటిస్తున్న చిత్రం ‘షంషేరా’. వాణికపూర్ కథానాయిక. కరణ్ మల్హోత్రా దర్శకుడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ‘షంషేరా’ ట్రైలర్ నూ చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరో రణ్ బీర్ పాత్రతో పాటు.. ప్రతినాయకుడిగా నటిస్తున్న సంజయ్ దత్ డైలాగ్స్ .. పోరాట సన్నివేశాలు అభిమానులను అలరించేలా ఉన్నాయి. ఇక షంషేరా ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో రణ్ బీర్…
దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!
దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. గత 24 గంటల్లో అధికారులు…