అక్షయ తృతీయ విశిష్టత!
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని.. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది. ఈరోజు లక్ష్మీ దేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకళలాడుతుందన్నది భక్తులు నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు…