బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు.. ప్రచారాన్ని స్పీడప్ చేసిన నేతలు..!!

Munugodebypoll: మునుగోడులో బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నేతలు చేరికలను స్పీడప్ చేశారు.తాజాగా నాంపల్లి,చౌటుప్పల్ మండలాలకు చెందిన ఇతర పార్టీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజగోపాల్ రాజీనామాతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ లో మునుగోడు నియోజకవర్గ ఓటర్లతో రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ…

Read More

కెసిఆర్ నూ పొట్టు పొట్టు తిట్టిన ఈటల .. ఓడగొట్టే వరకు నిద్రపోనని శపథం..

అసెంబ్లీ సస్పెన్షన్ పై  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. కేసిఆర్ నూ గద్దె దింపే వరకు నిద్రపోనని శపథం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పై మరమనిషి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నారని.. ఇటు అధికార టీఆర్ఎస్..అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రైతాంగం సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఇక మరమనిషి…

Read More

బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు.  సభకు ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ పాదయాత్ర. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ నాలుగో విడత ప్రజా…

Read More

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి.. గెలుపు కష్టతరమే..

Munugodubypoll: ఎన్నో ఊహాగానాలు మధ్య ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేసింది. టికెట్ కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, పున్నకైలాష్, పాల్వాయి స్రవంతిలు పోటీపడగా..పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్రవంతి వైపే మొగ్గు చూపారు. కాగా స్రవంతికి దివంగత రాజ్యసభ సభ్యులు  మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు. దీంతో  నియోజక వర్గంలోని పార్టీ నేతలు కార్యకర్తలతో  ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో స్రవంతి… 2014 అసెంబ్లీ ఎన్నికల్లో…

Read More

మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..

ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ  కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్…

Read More

రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల కౌంటర్..

టీపీసీసీ రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంని ఎద్దేవా చేస్తున్నారు.. 2015 శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్ల రూపాయల లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడి జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిదని కమలనాథులు  ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్…

Read More

టీఆర్ఎస్, కాంగ్రెస్ కి బిగ్ షాక్..బీజేపీలోకి టీఆర్ఎస్, కాంగ్రెస్ సర్పంచ్లు!!

మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వివిధ మండలాల సర్పంచ్లు, ఎంపిటిసిలు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న టీఆర్ఎస్ కు..సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి కమలం పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలో నోటిఫికేషన్ వెలువడిన ముందే వలసలు, ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాషాయం నేతలు.. అసమ్మతి నేతలను టార్గెట్ చేసినట్లు విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు….

Read More

రసకందాయంగా మునుగోడు రాజకీయం.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు?

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు చేరికల కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తనతో పాటు మరికొంతమంది ముఖ్యనేతలు బీజేపీలోకి రాబోతున్నారని వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల్లో కలవరం మొదలైంది. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు క్యాడర్ చేజారిపోకుండా నియోజకవర్గంలో మకాం వేసి…

Read More

తెలంగాణ చిన్నమ్మ దూరమై నేటికి మూడేళ్లు..!!

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించిన మహిళ నేత. పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన అజాత శత్రువు.. పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులకు దడపుట్టించే ఫైర్ బ్రాండ్. తెలంగాణ యువత బలిదానాలపై పార్లమెంట్ సాక్షిగా ఆవేదనతో ప్రసగించిన గొప్ప మానవతవాది . రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆమె.. తెలంగాణ చిన్నమ్మగా గుర్తుంచుకోవాలని అప్యాయంగా కోరుతూ సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. హర్యానా…

Read More

మునుగోడుపై నిధుల వర్షం.. వ్యూహాం మార్చనున్న రాజగోపాల్?

తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చనడుస్తోంది. ఉప ఎన్నిక వస్తేనే హుజురాబాద్ తరహాలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రకటించిన .. రెండు రోజుల్లోనే ప్రభుత్వం 33 కోట్లు నిధుల మంజూరుకై ప్రపోజల్స్ పంపాలని ఆదేశాలను జారీచేసింది. ప్రజాసమస్యలపై పలుమార్లు రోడ్లెక్కి, రాస్తారోకోలు చేసినా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోవడంతోనే నిధులు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్యే…

Read More
Optimized by Optimole