కేసీఆర్ స్పందించకపోవడం అవమానకరం : బండి సంజయ్
నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి స్పందించక పోవడం సిగ్గుచేటని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పోలీస్ వ్యవస్థను ఎంఐఎం చేతిలో పెట్టడం వలన రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయన్నారు. భైంసాలో మజ్లీస్ దౌర్జన్యాలు, హత్యచారాలకు పాల్పడుతున్న టీఆర్ ఎస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. భైంసాలో లా అండ్ ఆర్డర్ సమస్మ ఉందని, అక్కడి హిందువులను కాపాడాలని కోరుతూ బీజేపీ నేతలతో కలిసి సంజయ్.. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళ…