కేసీఆర్, చంద్రబాబు, జగన్ లేని ఇం.డి.యా బెంగళూరుకే పరిమితమా?
Nancharaiah merugumala :(political analyst) తెలంగాణ బీఆరెస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సంపూర్ణాంధ్ర ప్రదేశ్, అవశేషాంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానం లేని ఇండియాను (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్) ఊహించడం సాధ్యమేనా? ముగ్గురు తెలుగు ‘అగ్రనేతలు’ లేని ఇం.డి.యా వచ్చే ఏడాది 2024 వానాకాలం వరకైనా ఉనికిలో ఉంటుందా? చెప్పడం కష్టంకాదేమో! కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాలు…