తెలంగాణలో టగ్ ఆఫ్ వార్.. బీఆర్ఎస్ కు కష్టమే..?
Telangana: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడ్ అప్ చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో హ్యాట్రిక్ పై కన్నేసింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని పట్టుదలతో ఉన్నాయి.ఇప్పటికే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ జరిగేందుకు ఆస్కారం ఉందని…