త్రిపుర తీర్పు..లెఫ్టా..? రైటా…?
దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఈ రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకమైనవి. రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వానికి సెమీఫైనల్సే అని చెప్పవచ్చు. అందుకే బిజెపికి ఈ ఎన్నికలు పెను సవాలు విసురుతున్నాయి. తొలుతగా ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ 2014లో ఢల్లీి పీఠం…