ఇండియా vs ఎన్డీఏ లో గెలుపెవరిది?
అదానీ వ్యవహారంపై కొద్దికాలం క్రితం రాజ్యసభలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపట్ల అసహనం వ్యక్తం చేస్తూ ‘‘మీ అందరినీ ఎదుర్కోవడానికి నేనొక్కడినే చాలు.. నాకు మరొక్కరు అవసరం లేదు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గంభీరంగా చెప్పారు. బెంగుళూరులో ప్రతిపక్షాలు రెండోసారి సమావేశం అవుతుండగా సోమవారం ఉదయం కూడా ‘‘కేవలం మోదీకి వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలు అన్ని ఒక్కటవుతున్నాయి’’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రజాదరణతో గాని, విశేషమైన వనరులను మోహరించడంలో గాని, వ్యవస్థలను తలవంచే విధంగా చేసుకోవడమో…