Gvl: ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి?

Nancharaiah merugumala senior journalist: ” మెదడును సరిగ్గా వాడుకుని బాబు కేబినెట్లో మంత్రి దాకా ఎదిగిన ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి? “ మొన్నటి ఏప్రిల్‌ నెల వరకూ సత్యకుమార్‌ యాదవ్‌ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్‌ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్‌ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే…

Read Full News

Ramojirao: రామోజీ గారు అన్న మాటలివి..!

Nancharaiah merugumala senior journalist: ‘ ఫస్ట్ పుట్ ద పేపర్స్ ఆన్ మై టేబుల్ ‘…2007లో కలిసినప్పుడు రామోజీ గారు అన్న మాటలివి  ‘ఈనాడు’ సంస్థల్లో నేనెప్పుడూ రెగ్యులర్‌ ఉద్యోగిని కాదు, వారి పేరోల్స్‌ లో ఎన్నడూ లేను. ఇప్పుడు బతికి ఉన్నదో లేదో చెప్పడానికి వీలులేని తెలుగు డైలీ ‘వార్త’లో ఏ నెల జీతం ఏ తేదీన వస్తుందో తెలియని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నాకు– 2003లో ఆగస్టులో ఈనాడు జర్నలిజం స్కూల్‌ (ఈజేఎస్‌)లో…

Read Full News

Ramojirao:ఆయనో శిఖరం..చేసిందో యజ్ఞం..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: ‘మీరు ముఖ్యమంత్రి కావాలి సార్‌’ ఎంతో ఉత్సుకతో తన మనసు వెల్లడించిన ఓ సీనియర్‌ సబ్‌ఎడిటర్‌కి, తడుముకోకుండా బదులిచ్చారాయన. ‘ఏమయా, నేనిపుడు ఓ ముఖ్యమంత్రికన్నా తక్కువటయ్య?’ అని మనసారా నవ్వుతూ పలకడంతో ‘ఈనాడు’ ఎడిటోరియల్‌ నెలవారీ సమీక్ష సమావేశంలో నవ్వులు విరిసాయి. నిజమే, పలువురు ముఖ్యమంత్రులు గద్దెనెక్కడం, దిగడంలో అప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర పోషించిన మీడియా మొగల్‌ రామోజీరావు. పొద్దుపొడుపుకు ముందే వాకిట వచ్చి వాలే… ఈనాడుతో తెలుగునాట ఒక…

Read Full News

Parasite: బడుగు జీవుల బతుకు అద్దంపట్టే ఓ జీవధార ‘ ప్యార సైట్ ‘..

సాయి వంశీ ( విశీ):  ప్యారసైట్ సినిమా ఇవాళే చూశా. ఇంతకు ముందే చాలా మంది చూసేశారు. రాయాల్సిందంతా రాశేశారు. నేను కొత్తగా ఏం రాయాలి? ఉన్నది.. అనిపించింది రాయాలి. ప్యారాసైట్ చూస్తున్నంతసేపూ నాకు ‘జీవధార’ గుర్తొచ్చింది. ఎక్కడిదీ మాట? ఏంటసలా జీవధార? కథ:  కాళీపట్నం రామారావు గారు 1971లో రాసిన కథ. చిన్న కథ. కొండంత అర్థాన్ని నింపుకున్న కథ. పేదవాళ్ల పాకలన్నీ ఓ చోట చేరిన వాడ. అక్కడ అందరూ బడుగు జీవులే! ఎర్రటి…

Read Full News

Annamalai: అన్నామలై ఎందుకు ఓడిపోయారు?

సాయి వంశీ ( విశీ): ఆయనో ఇంటర్‌నెట్ సెన్సేషన్. మాజీ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రంలో కమలదళ అధ్యక్షుడు. ఆయన పేరు చెప్తే యూత్ అంతా ఉర్రూతలూగిపోతారు‌. దక్షిణాదిలో కమలదళానికి బలమైన యువశక్తి. తమిళనేలపై ఆ పార్టీకి ఆయనే వెన్నుదన్ను. అయినా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు ఎంపీ కాలేకపోతున్నారు? ఆయనే అన్నామలై. అన్నామలై కుప్పుసామి. 2024 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1.18 లక్షల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు….

Read Full News

Literature: స్వయంకృతాపరాధం..

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: స్వయంకృతం – – – – – – – – సీ : గర్వమెవ్వరినైన గతితప్పగాజేయు వడిజార్చి పడగొట్టు పతనమునకు, కడు అహంకారమే కడతేర్చు హోదాల కనరాని పాట్లనే కడ మిగుల్చు, దర్పమేవిధి సమ్మతము కాదు, సంపద మిడిసిపాటున దుఃఖమేను కడకు, ‘నేన’నేటి నియంత యెంతటి ఘనుడైన నాకౌట్ (Knockout) తప్పదేనాటికైన తే.గీ : యిన్ని రీతుల కాసుకొనిడుములుండ…. యేల నిశ్చింతగుండెనో యెరుకలేక! కలలొనైనను ఊహించనలవి కాని ఓటమాతడ్ని శాపమై…

Read Full News

Kangana: ‘ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం..!

సాయి వంశీ ( విశీ) :  2008లో విడుదలైన హిందీ సినిమా ‘ఫ్యాషన్’ చాలామందే చూసి ఉంటారు. మోడల్స్ జీవితంలోని పార్శ్వాలను అద్భుతంగా చూపించిన చిత్రం అది‌. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ పోటాపోటీగా నటించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా ఇద్దరికీ జాతీయ పురస్కారాలు రావడం విశేషం. ఆ సినిమాలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్ షోనాలి(కంగనా రనౌత్) వేసుకున్న బట్టలు ఉన్నట్టుండి తెగిపోతాయి‌‌. ఒక్క క్షణం ఆమె గుండె భాగం అంతా…

Read Full News

Ayodhya: అయోధ్యలో కమలం ఎందుకు వికసించలేదు?

సాయి వంశీ ( విశీ) :  నిజమే! మొత్తం దేశానికి ఇదొక ప్రశ్న. రామమందిరం కట్టారు, బాలరాముణ్ని ప్రతిష్టించారు, ఊరూవాడా ఏకం చేసి సంబరాలు చేశారు. అయినా అక్కడ కమలం వికసించలేదు. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబా‌ద్‌ ఎంపీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ 54,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంత భారీ ఆధిక్యంతో విజయం సాధించడం చిన్న విషయం కాదు. అసలు ఏం జరిగింది? కమలలోచనుడు ఎందుకు కమలం మీద శీతకన్నేశాడు? నిజానికి…

Read Full News

Elections2024: ‘ అక్షర సాక్ష్యం ‘ పీపుల్స్ పల్స్..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అన్నం ఉడికిందీ లేనిది తెలుసుకోవడానికి ఒకటి, రెండు మెతుకులు పట్టి చూస్తే చాలు, ఇట్టే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ పరిస్థితి ముందు నుంచీ మాకు లీలగా కనిపిస్తూనే వుంది. మా ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ ప్రజాక్షేత్రం నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని సర్వే గణాంకాల రూపంలో కౌంటింగ్ కు ముందే విలేకరుల సమావేశం పెట్టి వెళ్లడించాం. అంతకన్నా స్పష్టంగా ఆర్టికల్స్ రూపంలో…

Read Full News