janasenatdp: ” ప్రతి చేతికీ పని –  ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో జనసేన – టీడీపీ వినూత్న ప్రచారం..

janasenatdp:  ఏపీలో అధికార వైసీపీ  ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన- టీడీపీ కూటమి రూపొందించిన వీడియోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  ” హల్లో ఏపీ – బైబై  వైసీపీ “.. ” ప్రతి చేతికీ పని –  ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో రూపొందిన వీడియోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక  జనసేన, టీడీపీ అభిమానులు గురించి ఎంత చెప్పిన తక్కువే.. దొరికిందే చాన్స్ అన్నట్లు వీడియోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ” జనసేన – టీడీపీ పొత్తు గెలవాలంటే ప్రభుత్వం మారాలి .. సైకో పాలన పొవాలి ”  అంటూ కామెంట్లు జోడిస్తూ #Janasenatdpalliance ట్యాగ్ చేస్తున్నారు.

జనసేన – టీడీపీ కూటమి రావాలి- తుగ్లక్ పాలన పోవాలి..

ఇళ్ల నిర్మాణం గురించి వివరిస్తూ జనసేన – టీడీపీ రూపొందించిన వీడియో పరిశీలించినట్లయితే.. ఇళ్ల నిర్మాణం చేపట్టి నాలుగేళ్లు దాటింది. సిమెంట్, కాలువలో దొరికే ఇసుక రేట్లు పెరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వానికి  పార్టీ రంగుల మీద ఉన్న శ్రద్ధ.. పేదవాడి కన్నీళ్లను తుడవడంలో లేదు అంటూ ఓ పెద్దాయన వాపోతాడు. కొడుకు వరుసయ్యే  యువకుడు పెద్దాయనను ఓదారుస్తూ .. ” ఏంబాధపడకు పెద్దయ్య ఎలక్షన్లు దగ్గరికి వచ్చాయి కదా..జనసేన – టీడీపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనగానే.. పెద్దాయన స్పందిస్తూ  ” బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే జనసేన – టీడీపీ కూటమి రావాలి- తుగ్లక్ పాలన పోవాలి.. అంటూ  పిలుపునిస్తాడు.  

ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు…

నాలుగేళ్లుగా జాబ్ క్యాలెండర్ లేకపోవడం, నిత్యావసర ధరలు, బస్సు , కరెంట్ చార్జీలు పెరగడం, మద్యపాన నిషేదం అమలు కాకపోవడం వంటి హామీలను ప్రస్తావిస్తూ ” ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకు నీరు…”  నినాదంతో  జనసేన-  టీడీపీ రూపొందించిన వీడియోలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ” బాదుడే – బాదుడు”  ” జనసేన-  టీడీపీ” కూటమి రావాలంటే  సైకో పోవాలి  వంటి స్లోగన్స్ కు అనుగుణంగా రెండు పార్టీల అభిమానులు కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.  

Optimized by Optimole