×

APPOLITICS:  ‘ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడు. అలాంటి ఓటరుని గౌరవించుకోకపోతే ఎలా? పోలింగ్ బూత్ దగ్గర స్వయానా ఓ శాసన సభ్యుడు ఓటరుపై చెయ్యి చేసుకోవడం దారుణం. తెనాలిలో జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుని ముక్తకంఠంతో ఖండిస్తున్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని, లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లోనే ఉంది అనుకుంటే పొరపాటన్నారు. ఓటమి ఖాయమవడంతో సహనం కోల్పోయి, ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టేందుకు స్థానిక శాసన సభ్యుడు ఆ విధంగా ప్రవర్తించారు అన్నారు. ప్రజలు కచ్చితమైన తీర్పు ఇచ్చేశారనీ, నూటికి నూరు శాతం ప్రభుత్వం మారబోతోందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో తెనాలి అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.

సోమవారం తెనాలి నియోకవర్గం పరిధిలో పోలింగ్ బూత్ ల వద్ద ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ముగిసిన తరవాత శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి, శాసన సభ్యులు, మంత్రుల ప్రవర్తన ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. ప్రశ్నించే వారు ఎవరూ ఉండకూడదన్న మూర్ఖపు ఆలోచనతో ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగ అయిన ఎన్నికల ప్రక్రియని పాడు చేసే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన అందించాల్సిన వ్యక్తులే ఇలా ప్రవర్తించడం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. తెనాలిలో జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. ఓటు విలువను గ్రహించి ఓ సామాన్యుడు ఎంతో దూరం నుంచి ప్రయాణించి మరీ వచ్చి తన హక్కుని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తే , శాసన సభ్యుడే నిస్సిగ్గుగా కులాల ప్రస్తావన తీసుకురావడం, దాడికి పాల్పడడం దారుణం. దిగిపోయే ముందు చేసిన అనవసర రాద్ధాంతం ఇది.

మా ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ శ్రేణులు కవ్వించే చర్యలకు పాల్పడ్డారు. ఎంత రెచ్చగొట్టినా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులంతా సామరస్యపూర్వక వాతావరణంలో అధికారుల అనుమతులు తీసుకుని ముందుకు వెళ్లాం. తెనాలి 39, 40 వార్డుల పరిధిలో నాలుగు రోజుల ముందే అనుముతులు పొంది ఎన్నికల ప్రచారం చేసుకుంటుంటే ఉద్దేశపూర్వకంగా ఊరేగింపులు చేసి, అసాంఘిక చర్యలకు దిగుతూ భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఓటరు శ్రీ సుధాకర్ పై చెయ్యి వేసిన వారిని పోలింగ్ బూత్ వద్దే ఉండడానికి పోలీసులు ఎందుకు అనుమతిచ్చారు? అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలిసీ పోలింగ్ బూత్ లోకి ఎందుకు అనుమతిచ్చారు. అధికారులకు ఎవరు అల్లర్లు సృష్టించేవారో తెలియదా? ఓటింగ్ సరళిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. ప్రజలు ఆ ప్రయత్నాన్ని తిప్పికొడతారు. ఐదేళ్ల మీ ప్రవర్తనతో ప్రజలు విసుగెత్తిపోయారు. తెనాలిని గంజాయికి రాజధానిగా మార్చారు. ఇన్నాళ్లు అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషించిన వైసీపీ ప్రజా ప్రతినిధి చివరికి తన నైజం బయటపెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తులకు ప్రజలే సరైన తీర్పు చెబుతారు. తెనాలి ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా పరిగణించాలి. కచ్చితంగా చర్యలు తీసుకోవాలి” అన్నారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: కేరళలో యూడీఎఫ్ సర్కార్: పీపుల్స్ పల్స్

National: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల...

Read out all

National: తమిళనాడులో మ‌రోసారి డీఎంకే…

National: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు...

Read out all

National: పుదిచ్చేరిలో మ‌ళ్లీ ఏన్‌డీఏనే…

National: కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు...

Read out all

National: బెంగాల్ మళ్లీ దీదీదే: పీపుల్స్ పల్స్

National: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్...

Read out all

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all
Optimized by Optimole