కేసీఆర్ ఎక్కడ..?
– వ్యాక్సినేషన్ ప్రక్రియలో కనిపించని ముఖ్యమంత్రి – వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన లేదు కరోనా మహమ్మారి నిరోధానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉత్సాహంగా పాల్గొంటుంటే కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడం.. వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు అసెంబ్లీ సాక్షిగా వైద్య నిపుడికి మల్లే పారసీటామల్…
వెస్టిండీస్ సిరీస్ కూ కెప్టెన్గా శిఖర్ ధావన్!
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. జూలై 22న ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లుకి విశ్రాంతినిచ్చారు. ఇక జట్టులో యువ ఆటగాళ్లు దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ…
ప్రేత కల్యాణాలు.. అక్కడ ఆత్మలకు పెళ్లిళ్లు చేస్తారు..!
సాయి వంశీ ( విశీ) : 2022 జులై 18న దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ఇంట్లో శోభ, చంద్రప్పలకు వివాహం జరిగింది. ఆ పెళ్లి చుట్టుపక్కల చాలా పేరు పొందింది. ఎంతోమంది చెప్పుకునే విశేషమైంది. ఎందుకు? ఏమిటి ఆ పెళ్లిలో వింత? ఉంది. శోభ, చంద్రప్ప 30 ఏళ్ల క్రితమే మరణించారు. మరి పెళ్లి ఎవరికి? వారి ఆత్మలకు. ఆత్మలకు పెళ్లా? నిజంగా చేస్తారా? ఆత్మలు ఆ పెళ్లికి వస్తాయా? కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని…
బిగ్ బాస్ 5 నుంచి ప్రియాంక సింగ్ ఔట్!
తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆక్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్_5 చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎటువంటి అంచనాలు లేకుండా హోస్లో అడుగుపెట్టిన పింకీ 90 రోజుల పాటు ఉండటం మామూలు విషయం కాదు. జబర్దస్త్ వంటి షోల ద్వారా పాపులర్ అయిన ఆమె సెప్టెంబర్ 5 వ తేదీన మొదలైన సీజన్5లో 9 వ కంటేస్టెంట్గా…
తెలంగాణలో లాక్ డౌన్ మరో వారం రోజులు పొడగింపు..?
తెలంగాణలో కరోనా కట్టడి దృష్ట్యా విధించిన లాక్ డౌన్ గడువు జూన్ 30న ముగియనుంది. అయితే లాక్ డౌన్ కొనసాగించాలా.. లేదా అన్నది రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నపట్టీకి.. మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రజలుభారీగా బయటకురావడం.. మినహాయింపుల పేరుతో మరికొందరు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో.. విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. మంత్రివర్గ సమావేశం(ts cabinet meeting)లో చర్చించి నిర్ణయం తీసుకునే…
Telugupoetry: పువ్వులూ ‘ మనిషీ ‘…
Poetry: పువ్వులు మట్టి మశానాల పోషకాలతో పూస్తాయి. వాటి మొక్కలకు అందే నీళ్లు కొన్ని మురికిగా, కొన్ని స్వచ్ఛంగా ఉంటాయి. అయినా పువ్వులు పవిత్రమైనవి, అందమైనవి, సుగంధభరితమైనవి. వాటి రంగులు కళ్లకు ఇంపుగా, మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి. ఇక మనిషి- పువ్వుల అందాలను చూస్తూ కన్నీళ్ల కన్నా స్వచ్ఛమైన నీళ్లు తాగుతాడు. ఎర్రెర్రని యాపిల్ పండ్లను కొరుక్కు తింటాడు. అయినా అసహ్యంగా తయారవుతాడు. ఎందుకలా? — పాష్తో మూలం: పీర్ మహమ్మద్ కార్వాన్ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు…
స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ లో వర్గపోరు.. నేతలు సై అంటే సై..
స్టేషన్ ఘన్ పూర్ లో అధికార పార్టీ వర్గ పోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. స్టేషన్ ఘన్పూర్ తన అడ్డా అని.. ఎవరినీ రానివ్వనంటూ రాజయ్య వ్యాఖ్యలు చేయడంతో .. నియోజకవర్గంలో ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామా అంటూ కడియం సవాల్ విసిరారు. తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే బయట తిరగలేవంటూ హెచ్చరించారు. దీంతో కడియం వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన రాజయ్య .. తన…
Rangamaarthaanda : బ్రహ్మానందం ‘చక్రపాణి’ పాత్ర తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుపెట్టుకుంటారు..!
విశీ( సాయి వంశీ) : మలయాళ సినీరంగంలో సలీమ్ కుమార్ అనే నటుడు ఉన్నారు. హాస్యానికి ట్రేడ్ మార్క్. 41 ఏళ్ల వయసులో ఆయన చేత ‘ఆదామింటె మగన్ అబు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు దర్శకుడు సలీమ్ అహ్మద్. ఆయన పక్కన జోడీగా జరీనా వాహబ్. దర్శకుడిగా సలీమ్ అహ్మద్‌కు అదే తొలి సినిమా. హాస్యనటుడిగా పేరు పొందిన వ్యక్తి చేత అంత బరువైన పాత్ర చేయించాలని ఆయన అనుకోవడం నిజంగా సాహసమే! కన్నడ…
‘జగనన్నకు చెబుదాం కౌంటర్ ‘గా టీడీపీ నేత గిరిధర్ రెడ్డి వినూత్న కార్యక్రమం..
NelloreRural: వైసీపీ ప్రభుత్వం నేడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నకు చెబుదాం కౌంటర్ గా టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్ ప్రజా సమస్యలను ఏకరువు పెడుతూ..” ప్రజలగోడు చెపుతున్నాం.. వినండి.. మా సమస్యలను పరిష్కరించండి స్లోగన్ తో ఎంఎల్ఏ కార్యాలయంలో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి పనుల్ని ఏకరువు పెడదాం.. వినపడేలా ..విజృంబిద్ధాం .. సాధించుకుందాం ” అంటూ మీడియా వేదికగా పిలుపు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే…