పంచభూత లింగాలు విశిష్టత ఏంటి? ఎక్కడెక్కడ ఉన్నాయి?
ప్రాణకోటికి ఆధారం పంచభూతాలు. వీటికి మూలం పంచ స్థూల దేవాలయాలు. అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్న ఈ దేవాలయాల్లో పరమశివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు.శివరాత్రి పర్వదినాన లింగరూపంలో ఉన్న భోళాశంకరుడిని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతుంటారు. పంచ స్థూల దేవాలయాల్లో కొలువైఉన్నా పరమ పవిత్రమైన లింగాలను పంచభూత లింగాలుగా పిలుస్తారు. ఇంతటి విశిష్టత కల్గిన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం! 1. పృథ్విలింగం : ఇక్కడ కొలువైఉన్నా పరమేశ్వరుడిని ఏకాంబరేశ్వర స్వామి అంటారు. మామిడి చెట్టు కింద…
Brahmins: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..
Nancharaiah merugumala senior journalist: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..గోదావరి జిల్లాల్లో పూజారులు, పురోహితులపై పెరుగుతున్న దాడులు… సామాజిక భద్రత కోసం ఉత్తరాదిన (రాజస్తాన్, హరియాణా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్) బ్రాహ్మణులు వీధుల్లో గొడ్డళ్లు చేతబూని ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఏడాది కాలంగా హిందీ రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈ జులూస్లు నిర్వహిస్తున్నారు. (బ్రామ్మల కులదేవత పరశురాముడి ఆయుధం గండ్ర గొడ్డలి) మరో పక్క తెలుగు బ్రాహ్మణులకు అనువైన నేలగా…
మీకు మగబిడ్డ ఒక్కరా, ఇద్దరా? ఎక్కడ చూసినా గాజుల ముచ్చటే ..!
Women bangles sentiment: ఈసంగతి మీకు తెలుసా..! ఒక్క మగ బిడ్డ ఉన్న తల్లి..ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లితో గాజులు వేసుకోవాలట , ఇద్దరు బాబులు ఉన్న తల్లి.. ఐదుగురు బిడ్డల తల్లితో గాజులువేసుకోవాలట.. అది కూడా సంక్రాంతి ముందేనట..లేదంటే ఏదో జరిగిపోతుందంటా..ఇదే సెంటిమెంట్ ప్రచారం ఆ నోటా..ఈ నోటా ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించింది. తెలంగాణలో ఎక్కడా చూసినా ఇదే చర్చ హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ ఇద్దరు ఆడవాళ్లు కలుసుకున్నా..ఇదే ముచ్చట పెడుతున్నారట. మొత్తానికి…
కొండంత సంభాషణలున్నా.. గోరంత దృశ్యం కావాల్సిందే!
విశీ: తెలుగు సినీ పరిశ్రమలో ‘దాసి’ సినిమా ఒక సంచలనం. ప్రఖ్యాత దర్శకుడు బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన ఈ సినిమా నేటికీ భారతీయ సినిమాల్లో ఒక క్లాసిక్గా మిగిలింది. కథ, కథనం, నటీనటుల నటన, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం.. ఏ క్రాఫ్ట్లోనూ తగ్గక, తనదైన ముద్ర వేసింది. 1920లో తెలంగాణ ప్రాంతంలోని ఒక గడీలో దొర సాగించిన అరాచకాలు, దాసీల ఆవేదన, వారి జీవనశైలిని ఈ చిత్రం అచ్చంగా తెరకెక్కించింది. సినిమాలో నటి అర్చన దాసి కమ్లిగా…
బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా?
రవీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్-వార్తల్లోకెక్కిన ఈ బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా? …………………………………………………….. ఇద్దరు బిహారీ బ్రాహ్మణ బుద్ధిజీవులు- ప్రశాంత్ కిషోర్ (పాండే), రవీష్ కుమార్ (పాండే)కు వారి శక్తి సామర్ధ్యాలు, ప్రతిభాపాటవాలకు మించిన పేరు ప్రఖ్యాతులు వచ్చాయనిపిస్తోంది. వైశ్య (బనియా/కోమటి) పాత్రికాధిపతుల దగ్గర బ్రాహ్మణ పాత్రికేయులు, సంపాదకులు గతంలో చాలా పెద్ద సంఖ్యలో పనిచేశారు. ఇంకా పనిచేస్తున్నారు. పెత్తనం చేస్తున్నారు. బనియాల పెట్టుబడి బ్రాహ్మణ జర్నలిస్టులకు ఏనాడూ చేదు కాలేదు. వైశ్యులైన రామ్ నాథ్…
ఔరా! ఎంతటి మొనగాడవు..!!
– ఎట్లా అబ్బింది నీకింతటి నేర్పరితనం? – ఇన్నేసి యేళ్లు ఈ నైపుణ్యాన్ని కాపాడుతూ, ఎలా వన్నెపెట్టగలిగావు? ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనొల్డో ప్రస్తావన వస్తే చాలు, మన మెదళ్లలో ఇన్నేసి ప్రశ్నలు సహజం! ఒళ్లు గగుర్పాటుకు ఇది అదనం. ఎందుకంటే, అతగాడి రికార్డు అలాంటిది. వింటేనే విస్మయం కలిగించే రికార్డులు సరే, చూస్తుంటే రోమాలు నిక్కబొడిచేలా… మైదానమంతా లాఘవంగా పరుగెత్తే వేగం, డేగలా ఎగిరే సత్తా, రబ్బరులా వంగే శరీర విన్యాసం, కదలికల…
ఐపీఎల్లో ముంబై బోణి!
ఐపీఎల్ తాజా సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. మంగళవారం కోల్కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాట్సమెన్ సూర్యకుమార్ యాదవ్ (56; 36 బంతుల్లో 7×4, 2×6) , కెప్టెన్ రోహిత్ శర్మ(43; 32 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. కోల్ కత్త బౌలర్లలో రసెల్(15/5) అద్భుతంగా బౌలింగ్ చేసి…
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 10 వేల కేసులు..
Covid2023: దేశంలో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే కేసుల సంఖ్య రోజురోజుకు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 10 వేల 158 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రకారం తెలిసింది. నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల్లో 30 శాతం పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేల 998గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4…
