పతనం అంచున పోలీస్ ప్రభుత్వం: ఎంపీ రఘురామ
ఏపీలో ప్రభుత్వం మారితే..ఇంతకంటే గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. రాష్ట్రంలోని ప్రజలకు.. రాజ్యాంగంలో 14 నుంచి 22వ అధికరణ లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే.. వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలన్నారు. ఎలుకల్లా అధికారంలోకి వచ్చినవారు.. పందికొక్కుల్లా మారి ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. పతనం అంచున పోలీస్ ప్రభుత్వం.. పతనం అంచుల్లో ఏపీ పోలీసు ప్రభుత్వం ఉందని…