పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి: ఎస్పీ రెమా రాజేశ్వరి
నల్లగొండ: ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయాని జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి పేర్కొన్నారు.రాష్ట్ర పోలీసు నియామక మండలి నియమాల ప్రకారం ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా..పూర్తి సాంకేతికత పరిజ్ఞానంతో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా పోలీస్ అధికారులు..సిబ్బంది.. ఇతర సాంకేతిక నిపుల సహకారంతొ ప్రశాంతంగా దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్స్) పరీక్షలు ముగిశాయని ఎస్పీ వెల్లడించారు. ఇక మొత్తం 26 వేల 433 మంది అభ్యర్థులకు గాను.. 23 వేల 524 మంది…