చెన్నై ‘హ్యాట్రిక్’ విజయం!
ఐపీఎల్ తాజా సీజన్లో చెన్నై జట్టు హ్యాట్రిక్ విజయలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేరుకుంది. బుధవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 18 పరుగుల తేడాతో గెలిచి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(64; 42 బంతుల్లో 6×4, 4×6), డుప్లెసిస్(95; 60 బంతుల్లో 9×4, 4×6) రాణించారు. మొయిన్ అలీ(25;…
