మత్స్యకారులకు ఎల్లవేళలా జనసేన అండగా ఉంటుంది: నాదెండ్ల మనోహర్
ఉత్తరాంధ్ర ప్రాంతంపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విద్య, వైద్యం, వలసల నిరోధం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా దేహీ అంటూ అడుక్కునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందన్న ఆయన..రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలని వ్యాఖ్యానించారు. ఇక…