భాజాపా కురవృద్ధుడు కళ్యాణ్ సింగ్ కన్నుమూత!
యూపీ మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత కల్యాణ్‌సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొద్దరోజులుగా లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బాల్యం.. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ అలీఘడ్ 1932 జనవరి 5 న మారుమూల గ్రామంలో జన్మించారు.చిన్నపాటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. అనతి కాలంలోనే జన్ సంఘ్.. జనతా పార్టీ.. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు….