మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..
ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్…
యువత దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి: జేడి లక్ష్మీనారాయణ
నల్గొండ:యువత దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలని హితవు పలికారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో జనగణమణ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు. అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. అలాంటి…
దేశంలో స్ధిరంగా ఇంధన ధరలు..
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఇంధనం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… ఢిల్లీలో నిన్నటిలాగానే లీటర్ పెట్రోల్ 103 రూపాయల 97 పైసలు ఉండగా, డీజిల్ ధర 86 రూపాయల 67 పైసలుంది. ఇక, హైదరాబాద్‌లో పెట్రోల్ ఈ రోజు స్థిరంగా 108 రూపాయల 20 పైసలుంటే……
ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు..
Nancharaiah merugumala senior journalist:ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు…అటల్ జీ కొత్త జీవిత చరిత్ర చదివితే–కాషాయ నేతలు ఎంతటి ‘చరిత్రకారులో’ తెలుస్తుంది! దిల్లీలోని నెహ్రూ మ్యూజియం అండ్ మెమోరియల్ లైబ్రరీ సొసైటీ అనే ప్రఖ్యాత సర్కారీ సంస్థ పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ అని మార్చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. 59 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ పేరులోని నెహ్రూ అనే మాటను తొలగించడం సహజంగానే…
వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సలహాదారుల పాలు : నాదెండ్ల మనోహర్
Janasenaparty: వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు ఎంతో అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాలని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లని స్పష్టం చేశారు. ఇందులో ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు అని.. ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు…
ప్రభాస్ ‘సలార్ ‘లో పృధ్వీ రాజ్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్‌నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డార్లింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్ విన్న వెంటనే తన పాత్ర నచ్చడంతో ఆయన వెంటనే ఒప్పేసుకున్నారని ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభాస్ చెప్పుకొచ్చారు. కాగా ఇందులో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన…
ABVp రాజు మరణం ఉద్యమాలకు తీరని లోటు: బండి సంజయ్
Miryalguda: ఏబీవీపీ జాతీయ మాజీ కార్యదర్శి, ఉస్మానియా ముద్దు బిడ్డ కడియం రాజు అకాల మరణం తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కడియం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కడియం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, …