subbaReddy:సుబ్బారెడ్డిభార్య క్రిస్టియన్ అంటే నమ్ముతారా? చంద్రబాబుకు ఏదో అయింది!

Nancharaiah merugumala senior journalist:

వైవీ సుబ్బారెడ్డి ‘ బద్మాష్ ‘ అంటే అందరూ నమ్ముతారు గాని భార్య స్వర్ణలత క్రిస్టియన్ అంటే నమ్ముతారా? చంద్రబాబుకు ఏదో అయింది!

నిజంగానే మారాడు, ఏపీని మళ్లీ గాడిన పెడతాడు అనుకున్న ఎన్.చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014-2019 నాటి పోకడలకు తెరతీయడం తెలుగోళ్లు అందరికీ మహా విషాదం. వైఎస్ జగన్ తల్లి బైబిల్ పట్టుకు తిరుగుద్ది అంటే పడి కోట్ల తెలుగోళ్ళు నమ్ముతారు. అంతేగానీ రామాంజనేయులు రెడ్డి అనే రాయలసీమ హిందూ రెడ్డి ఇంట పుట్టుకతోనే హిందువుగా నేలపై పడిన స్వర్ణలత అనే మహిళను బైబిల్ పట్టుకు తిరుగుతుందని అమరావతిలో చంద్రబాబు చెప్పడం ఆయన బుర్రకు రాజమండ్రి కేంద్ర కారాగారంలో జగన్ ముఠా ఆయనకు తెలియకుండా బొక్క పెట్టారేమోననే అనుమానాన్ని బలోపేతం చేస్తోంది.

అధికార రాజకీయాల్లో నారా వారు వంటి పెద్ద నేతలు అబద్ధాలు చెప్పొచ్చు, వాటిని తెలివిగా ప్రచారంలో పెట్టొచ్చు. కాని ప్రజలను నమ్మించవలవి కాని మాటలు ప్రచారంలో పెడితే తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం వస్తుందంటే నిజమే కావచ్చు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంట్రిగా ఉండగా సర్పంచ్ పదవికి కూడా అర్హతలేని వైవీ సుబ్బారెడ్డి భార్య గురించి ఇలాంటి ప్రచారం వల్ల దీర్ఘకాలంలో నష్టమే. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్వర్ణ పవర్ వంటి కంపెనీల ద్వారా సుబ్బారెడ్డి ఏం చేశాడో ఇప్పుడు ఎండగట్టవచ్చు. అలాగే, 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టికెట్ జగన్ ఇవ్వకపోతే…వైవీ సుబ్బారెడ్డి అమెరికా పారిపోయి, వాడిన కొడుకు ప్రమాణానికి బెజవాడ చేరుకుని వేదికపై హడావుడి చేసిన నమ్మకద్రోహి, నైతిక విలువలు లేని సన్యాసి, దొంగస్వామి అని చంద్రబాబు గుర్తుచేస్తే కోస్తా, రాయలసీమ జనం నమ్ముతారు. ఇంకా సొంత చెల్లెలి మొగుడు బాలినేని శ్రీివాసరెడ్డితో కూడా సఖ్యంగా ఉండలేని చవట నాయకుడు వైవీ సుబ్బారెడ్డి అని ఏపీ ముఖ్యమంత్రి గారు చెబితే సకలాంధ్రులు సంతోషిస్తారు. అంతేగానీ అక్క విజయమ్మతో ఉన్న అనుబంధాన్ని వాడుకుని భర్తకు టీటీడీ బోర్డు చర్ మూఅన్ పదవి ఇప్పించుకున్న స్వర్ణలత బైబిల్ పట్టుకు తిరుగుతుందని అంటే చంద్రబాబు సానుభూతిపరులు సైతం ఆయనను చూడి జాలిపడతారు. మొత్తానికి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబుకు ఏదో అయిందనే అనుమానం ఆయన శనివారం మాటలని బట్టి అనిపిస్తోంది.