×
In

భారత్ _ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 లో పరుగుల వరదపారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు దంచికొట్టింది.సూర్యకుమార్ యాదవ్ ,కెఎల్ రాహుల్ ,విరాట్ కోహ్లీలు చెలరేగడంతో 237 పరుగులు సాధించింది. అనంతరం చేధనలో సఫారీ జట్టు తడబడిన గట్టిపోటి ఇచ్చింది.డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ (106నాటౌట్) మెరుపు సెంచరీ చేయగా.. ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయడంతో ..భారత్ 16 పరుగులతో విజయం సాధించి సీరిస్ ను 2_0 తో కైవసం చేసుకుంది.

తొలుత రాహుల్.. ఆపై’ సూర్య’ ప్రతాపం..
తొలుత బ్యాటింగ్ దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రాహుల్ , రోహిత్ అదిరే ఆరంభం ఇచ్చారు. ఆదినుంచే దంచుడు కార్యక్రమం మొదలెట్టారు. ముఖ్యంగా రాహుల్ ఆచితూచి ఆడుతూనే చెత్తబంతులను చీల్చిచెండాడు. ఈక్రమంలో ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న క్రమంలో రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ వస్తూనే సునామీలా విరుచుకుపడ్డాడు. స్పీప్, కట్ ,క్లిక్ ,.. చూడముచ్చటైన షాట్స్ తో సఫారి బౌలర్లను బెంబెలెత్తించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు.మరో ఎండ్ లో ఉన్న కోహ్లీ సైతం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. చివర్లో సూర్య ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తిక్ ఫోర్ ,రెండు సిక్సర్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

మిల్లర్ ..కిల్లర్

భారీ లక్ష్య చేధనలో  సఫారి జట్టు ఆరంభం పేవలంగా సాగింది. కెప్టెన్ బవుమా ,రొసో డకౌట్ అయ్యారు. ఆతర్వాత వచ్చిన డికాక్ , మార్ క్రమ్ కొంచెసేపు భారత బౌలర్లను నిలువరించారు. ఈక్రమంలోనే మార్ క్రమ్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిల్లర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు ,సిక్సర్లతో స్టేడియాన్ని హోరిత్తించాడు.అటు ఓపెనర్ డికాక్ సైతం తనదైన శైలిలో ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈక్రమంలోనే ఆఖరి ఓవర్లో రెండు సిక్స్ లు కొట్టి మిల్లర్ శతకాన్ని పూర్తి చేశాడు. వీరిద్దరు చెలరేగిన జట్టును మాత్రం ఓటమిని నుంచి గట్టేక్కించలేకపోయారు.దీంతో మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే సాధించడంతో 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

 

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

cricket:“నీ పోటీ ప్రపంచంతో కాదు— నిన్నటి నీతో”

Sports: క్రికెట్‌లో  కొన్ని ఇన్నింగ్స్‌లు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. కానీ సంకల్పంతో, సహనంతో, విమర్శల వర్షాన్ని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌లు మాత్రం అరుదు. టి20 ప్రపంచకప్ వేదికగా వెస్టిండీస్‌పై సంజూ...

Read out all

Sports: బంతి ఎగిరిన చోటు..!!

ఆర్. దిలీప్ రెడ్డి(సీనియర్ జర్నలిస్ట్): అది 1978. పదో తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు రావడానికి ఇంకా సమయముంది. హైదరాబాద్ వెళ్లి, వకీలుగా ఉన్న మా మేనమామ క్రిష్ణారెడ్డి ఇంట...

Read out all

National: Palash Muchhal–Smriti Mandhana Wedding Controversy…

Smriti Mandhana: A closer look at the unverified online rumours linking choreographer Nandika Dwivedi to the postponed wedding of Palash Muchhal and...

Read out all

cricket: King Charles III Interacts with Indian Cricketers During UK Tour…!!

Cricket: During their ongoing tour of England, the Indian men’s and women’s cricket teams were extended a special invitation by King Charles...

Read out all

Hyderabad:హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్..

Hyderabad: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA) – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మధ్య ఇటీవల చోటుచేసుకున్న టికెట్ల వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్...

Read out all

Wimbledon:మొక్కవోని నీ పట్టుదలకు శాల్యూట్!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తన కళ్లను తానే నమ్మలేని నిజం. తాను కొట్టిన షాట్ కు బదులిచ్చే యత్నంలో, ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రత్యర్థి! జస్ట్,...

Read out all
Optimized by Optimole