Telangana: నమ్మి ఓట్లేసిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: బండి సంజయ్

Bandisanjay: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు…రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని, పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యమెందుకని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న  మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే ‘రైతు…

Read More

Bandisanjay:కేటీఆర్ కండకావరంతో కన్నుమిన్నూ కానకుండా మాట్లాడుతున్నారు: బండి సంజయ్

Bandisanjay:  పార్లమెంట్ లో తాను ఏనాడూ మాట్లాడలేదని, ఒక్క పైసా తీసుకురాలేదంటూ కేటీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్ కు కళ్లు దొబ్బాయని, ఒక్క పార్లమెంట్ రికార్డులు చూసుకోవాలని సూచించారు. పార్లమెంట్ లో నిరంతరం వినోద్ కుమార్ మాట్లాడారని కండకావరమెక్కి మాట్లాడుతున్న కేటీఆర్… మరి వినోద్ కుమార్ సాధించేదేమిటో చెప్పాలన్నారు. కరీంనగర్- జగిత్యాల, కరీంనగర్–వరంగల్, ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్ల విస్తరణకు నిధులెందుకు తేలేదని ప్రశ్నించారు. ఆయా…

Read More

Prajahitayatra: 6 గ్యారంటీల కోసం బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడటం లేదు?

Bandisanjay: ‘‘మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. 6 గ్యారంటీలు అటకెక్కబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల  హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నారని.. గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం.. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది… ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాంగ్రెస్ కాకమ్మ కథలు చెప్పబోతుందని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా  బండి సంజయ్ జమ్మికుంట టౌన్ లో ప్రసంగించారు….

Read More

Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్ర షురూ…

Bandisanjay:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపటి నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో రేపు ఉదయం 11  గంటలకు  యాత్ర ప్రారంభించనున్నారు. తొలిరోజు కోహెడ మండలంలో ప్రారంభమయ్యే యాత్ర  తీగలగుంటపల్లి, గోటమిట్ల, నారాయణపూర్, విజయనగర్ తోపాటు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి బొమ్మనపల్లి సమీపంలోని ప్రైవేట్ స్కూల్ లో బస చేస్తారు.  యాత్రలో…

Read More

Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్రకు రూట్ మ్యాప్ రెడీ..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 26 నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రం నుండి మలిదశ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించాలని నిర్ణయించిన బండి సంజయ్ 26 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్,…

Read More

Bandisanjay: 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నరు..

Bandisanjay:‘‘బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు… కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లున్నరు. ఎంఐఎం నేతలున్నరు. ఎటువైపు ఉంటారో ప్రజలు తేల్చుకుంటరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ నుండి 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్…

Read More

Bandisanjay: బండి సంజయ్ తొలి విడత ‘ ప్రజాహిత’ యాత్ర సక్సెస్..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలిదశ ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఈ యాత్ర కొనసాగింది. మొత్తం 81 గ్రామాల్లో ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ…

Read More

Bandisanjay: సంజయ్ యాత్రకు అపూర్వ స్పందన.. రేపే తొలి విడత యాత్ర ముగింపు..

Bandisanjay: bandisanjay  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలివిడ ప్రజాహిత యాత్ర రేపటితో ముగియనుంది. రేపు మధ్యాహ్నం సిరిసిల్ల నియోజకవర్గంలోని అగ్రహారం వద్ద ప్రజాహిత యాత్ర తొలివిడత యాత్రను ముగించనున్నారు. డిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో వారం రోజులు యాత్రకు బండి సంజయ్ బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం మలివిడత ప్రజాహిత యాత్రను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొనసాగించనున్నారు. మరోవైపు 5వ…

Read More

Bandisanjay: బండి సంజయ్ యాత్రతో కాషాయం దళంలో జోష్..

Bandisanjay: బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర మూడో రోజు వేములవాడ రూరల్ గ్రామాల్లో సాగింది.యాత్రకు అడుగడుగునా ప్రజలు నుంచి అనూహ్య స్పందన లభించింది. గడప గడపకు తిరుగుతూ సంజయ్ ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేములవాడ నియోజక వర్గానికి ఇచ్చిన నిధులను లెక్కలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. కృష్ణా జిల్లాల వాటా విషయంలో అసెంబ్లీ వేదికగా  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాను…

Read More

Bandisanjay: ప్రజాహిత యాత్రతో సమర శంఖం పూరించిన బండి సంజయ్..!!

Bandisanjay:  బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర భారీ జన సందోహం మధ్య ప్రారంభమైంది. కొండ గట్టు అంజన్న ఆశీర్వాదంతో సంజయ్.. మేడిపల్లి నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజే  సంజయ్ కు మద్దతుగా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు  తరలివచ్చారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. యాత్రలో భాగంగా మేడిపల్లి మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో  మమేకం అవుతూ ఎంపీ ముందుకు సాగారు. ప్రజల కష్టాలను తెలుసుకొని…

Read More
Optimized by Optimole