Telangana :విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ చెల‌గాటం : ఎస్ఎఫ్ఐ

Atmakur: విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంద‌ని ఆత్మకూర్ మండల ఎస్ఎఫ్ఐ అధ్య‌క్షులు చరణ్ ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం మండలంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో విద్యాసంస్థల బంద్ చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. గత నెల రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ‌ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాల‌వ‌డం.. చనిపోతూ ఉంటే ఎమ్మెల్యేలు ప‌ట్టింపులేన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం సిగ్గుచేట‌న్నారు. వరుస ఘటనలతో విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ త‌క్ష‌ణ‌మే విచార‌ణకు…

Read More

MLC2024: ఎమ్మెల్సీ టికెట్ దక్కేదెవరికి .?

MLCElections2024: ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నఅభ్యర్థులు..ఆశావహులు ప్రచారాన్ని మొదలెట్టారు. రోజువారీగా వివిధ కార్యక్రమాల పేరిట ప్రచారం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సమంగా సీట్లు గెలుచుకున్న అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను రచించడంలోనిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఆరునూరైనా సరే బలమైన అభ్యర్థిని రంగంలో నిలిపి గెలిచి తీరాలని దృడ నిశ్చయంతో కనిపిస్తోంది. టికెట్ కోసం మంత్రుల లాబీయింగ్.. కరీంనగర్,…

Read More

Telangana: సీఎం రేవంత్ నాయకత్వాన్ని అస్థిరపరిచే కుట్ర: పటేల్ రమేష్ రెడ్డి

Telangana:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ లగచెర్ల లో కలెక్టర్ పై దాడి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్ది అమాయక ప్రజలను రెచ్చగొట్టారని.. కేటీఆర్…

Read More

Telangana: అధికార, విపక్షాల మాటల రాజకీయంతో ప్రజలకు మేలు జరిగేనా..?

Raparthy vinod Kumar : తెలంగాణ లో ఒక్క ఘటనతో రాష్ట్ర రాజకీయాలు అమాంతంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కులగణన ఓవైపు …. మరోవైపు ఫార్మా సిటీ పేరుతో వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూముల సేకరణకు వెళ్లిన కలెక్టర్ పైదాడి ఘటనలు గత వారం రోజులుగో పేపర్లో హెడ్ లైన్స్ గా, టీవీలో బ్రేకింగ్ న్యూస్ లు అయ్యాయి. కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పిన.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూనే ఉన్నారు. మూడు…

Read More

Telangana: జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి: మంత్రి తుమ్మల

Vinod:  తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని, పసుపు రైతుల చిరకాల ఆకాంక్షను కేంద్రం గౌరవించాలని.. గతేడాది అక్టోబర్ లో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ మాటను నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరారు. రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని మంత్రి తెలిపారు.రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్ ప్రధానమైనమైందని, గత…

Read More

KTRcomments: రేవంత్, పొంగులేటి ప‌ద‌వులు ఊడ‌టం ఖాయం: కేటీఆర్‌

KTRVSREVANTH: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన చాలా మంది ప‌ద‌వులు కోల్పోయార‌ని ..త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప‌ద‌వులు ఊడ‌టం ఖాయ‌మ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఈసంద‌ర్భంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చార సమ‌యంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మారింద‌ని చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తుచేశారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌క‌మైన అమృత్ టెండ‌ర్ల‌లో ఇంత పెద్ద అవినీతి జ‌రుగుతున్నా.. ప్ర‌ధాని…

Read More

Musirevival: మూసీ పునరుజ్జీవనంతో బాధెవరికి? మేలెవరికి?

Musi riverfront: నదుల వెంట నాగరికత విలసిల్లిందని మానవ వికాస చరిత్ర చెబుతోంది. నగరాలు నరకకూపాలై నదులను విషతుల్యం చేయడం మన కళ్లముందరి ఆధునిక వాస్తవం. పరిశ్రమల విషరసాయనాలు, మానవ వ్యర్థాలు, ఇతర మురుగుతో కాలుష్యమైన మూసీ దేశంలోనే అత్యంత విషపూరితమైన నదిగా, ప్రపంచంలోని పాతిక అతి కాలుష్య నదుల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రాజధాని హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే ఈ ప్రకృతి జల సంపదను దశాబ్దాల నిర్లక్ష్యంతో నాశనం చేసుకున్న హీనచరిత్ర మనది. దిగువ గ్రామీణ…

Read More

Runamaphi: రైతు రుణమాఫీతో కాంగ్రెస్ ఎస్కేప్ ప్లాన్ ..!

Telangana: రుణమాఫీతో తమది రైతు అనుకూల ప్రభుత్వమని నమ్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం భారీ ఎత్తున ప్రకటనలకు, సంబరాలకు కోట్ల రూపాయిల్ని ప్రభుత్వం మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. మొదటి విడతలో చేసిన మాఫీతో అన్నదాతలందరూ తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది.  ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణమాఫీ సంపూర్ణంగా లేకుండా ఒక మాయాజాలంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం పారదర్శకతతో అమలు చేస్తేనే…

Read More
జీవన్రెడ్డి,jeevanreddy,mlc,

Telangana: పోచారం చేరిక అవకాశవాదానికి నిదర్శనం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Telanganacongress:  తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌పై ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యే స‌భ్యుల‌తో సుస్థిర ప్ర‌భుత్వం ఉంద‌ని.. ఇత‌ర పార్టీ నేత‌ల‌ను చేర్చుకోవాల్సిన అవ‌స‌రమేముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏ రాజ‌కీయ పార్టీ అయినా సిద్ధాంంతాల‌కు అనుగుణంగా పోరాటం, ప‌ని చేయాల‌ని హితువు ప‌లికారు. దీంతో పార్టీ ఫిరాంపుల‌పై జీవ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ హ‌స్తంపార్టీలో కొత్త చ‌ర్చ‌కు దారితీసింది. ఇక తాజాగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో…

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More
Optimized by Optimole