Indira Gandhi: మంత్రగత్తెను రాళ్లతో కొట్టి చంపినట్టే.. ఇందిరను బులెట్లతో నింపారు..!

Nancharaiah merugumala senior journalist: మంత్రగత్తె ముద్రేసి రాళ్లతో కొట్టి చంపినట్టే ఢిల్లీలో ప్రధాని ఇందిరను 40 ఏళ్ల క్రితం బులెట్లతో నింపారు ప్రథమ భారత ప్రధాని ఏకైక బిడ్డ ఇందిరాగాంధీ 1966 శీతాకాలంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే నాటికి పదేళ్ల నిండడానికి దగ్గర్లో ఉన్న మా తరం తెలుగోళ్లు చాలా మందికి ఆమె ఇప్పటికీ చిక్కుముడిగానే కనిపిస్తోంది. 1971 లోక్‌సభ ఎన్నికల నాటికి టీనేజీ పిల్లలమైన మాకు అప్పుడు ఇందిరాగాంధీ గెలవాలని అనిపించింది. నాలుగేళ్ల తర్వాత…

Read Full News

Telangana: సిపిఎం పార్టీకి విరాళాలు ఇచ్చి ఆదరించండి: వేముల బిక్షం

Atmakur:  ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న  సిపియం పార్టీకి విరివిగా విరాళాలు అందించి ఆదరించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ఓ ప్రకటనలో కోరారు. ప్రజా శ్రేయస్సు కై ఉద్యమాల ఊపిరిగా పోరాడుతున్న పార్టీని తమవంతు సహాయ సహకారాలు అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ పట్టణంలో డిసెంబర్ 15,16,17 తేదీలల్లో సిపిఎం 3వ జిల్లా మహా సభలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి బహిరంగ…

Read Full News

IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!

IndiraGandhi Birthanniversary: ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా ‘సౌత్ గ్లోబ్’ అని మనం గొంతెత్తుతున్నామే… అభివృద్ది చెందని-వెనుకబాటు ‘దక్షిణ ప్రపంచ’ దేశాలకు ఒక ఉమ్మడి ఊపిరయింది. ఆ ధీర-గంభీర స్వరం వేరెవరిదో కాదు…. భారత ఉక్కుమహిళా ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీది. స్వీడన్…

Read Full News

periyar: పెరియార్‌కు అంత గౌరవం అవసరమా..?

విశీ(వి.సాయివంశీ) : (‘సుమతి మేఘవర్ణం’ తమిళనాడు బీజేపీ నేత, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు. ఎంఏ, ఎంఫిల్ చదువుకున్నారు. పబ్లిక్ స్పీకర్‌గా గుర్తింపు పొందారు. అధికార డీఎంకే మీద తన సూటి విమర్శలు, విశ్లేషణలతో విజృంభిస్తారన్న పేరున్న నాయకురాలు. పలు తమిళ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలు ఇవి. ఇవన్నీ పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలు. వీటితో వ్యాసకర్తకు ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు). హిందీని తమిళనాడు మొత్తం వ్యతిరేకించడం లేదు. కేవలం డీఎంకే చేస్తున్న ప్రచారం…

Read Full News

atreya: ఎక్కడ Volga to Ganga ? ఎక్కడి ఆత్రేయ పాటలు..!

Nancharaiah merugumala senior journalist: ‘ కొళిపన్నయ్ చెల్లదురయ్ ‘ అనే తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ఇప్పుడు OTT లో చూస్తున్నా. దాంట్లో లైబ్రేరియన్ గా పనిచేసే ఒక మధ్య వయసు తండ్రి తన పాతికేళ్ల కొడుకుతో, ” నీకు బతుకంటే ఏంటో తెలియదు రా. సినీ పాటల రచయిత ఆచార్య ఆత్రేయ గారి పాటలన్నీ విను. అప్పుడు నీకు జీవితం ఏంటో అర్థమవుతుంది, ” అని అంటాడు. అదే సమయంలో…టీవీ సెట్ స్క్రీన్…

Read Full News

Kasturi: నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్‌’..!

Nancharaiah merugumala senior journalist: తమిళబ్రాహ్మణ నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్‌’ మరి తెలుగోళ్లందరినీ అవమానించిందనే పేరుతో అరెస్టు దాకా ఎందుకు పోయింది? తమిళనాడులో లేదా పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో మూడొందల ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగు వారి గురించి కించపరిచే తీరులో మాట్లాడిన సినిమా నటి కస్తూరిని (50) శనివారం హైదరాబాద్‌ నార్సింగిలో అరెస్టు చేశారని తమిళనాడు పోలీసులు చెబితే తెలసింది. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌…

Read Full News

Jandhyala : “జంధ్యాల” కు నవ్వించడమేకాదు.. గుండెను మెలిపెట్టడమూ తెలుసు..!

విశీ(వి.సాయివంశీ) : జంధ్యాల గారంటే కామెడీకి ట్రేడ్ మార్క్ అంటారు కానీ, తెలుగు సినిమాల్లో ఆయనలా సెంటిమెంట్ సీన్లు రాయగలిగిన మరో రచయిత కనిపించడు. నవ్వులు కురిపించడమే కాదు, గుండెను మెలిపెట్టడమూ తెలిసిన రచయిత ఆయన. నిజం! ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘ఆపద్బాంధవుడు’, ‘అబ్బాయిగారు’.. చెప్తూ పోతే బోలెడు. ‘అహ నా పెళ్లంట’ లాంటి క్లాసిక్ కామెడీ ఫిల్మ్‌లో కూడా రాజేంద్రప్రసాద్, నూతన్‌‌ప్రసాద్‌ల మధ్య తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ను అద్భుతంగా పండించారు. ‘ష్.. గప్‌చుప్’ అని జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన…

Read Full News

MitrMyfriend: పిల్లలు ఎదిగే వేళ.. తల్లులు ఒంటరిగా మిగిలే వేళ..!

విశీ:  బిడ్డ పుట్టగానే స్త్రీ తల్లి అవుతుంది. ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటుంది. బాల్యం దాటి, యవ్వనంలోకి అడుగుపెట్టి, ప్రపంచాన్ని విస్తృతం చేసుకుంటూ ముందుకు సాగి, ఇంకా ఇంకా మరెన్నో సాధించాలనే తపనతో ఉన్నప్పుడు తల్లులు ఇంకా తల్లులుగానే ఉంటారు. తల్లితనాన్నే ఆస్వాదిస్తూ, ఒకానొక దశ తర్వాత ఆ తల్లితనంలోనే చిక్కుకుపోతుంటారు. రాముడు అంతఃపురం దాటి, మిథిల చేరి, ఆపై అడవులకు వెళ్ళి, రావణ సంహారం చేసినా అతను కౌసల్య తనయుడే! రాజమాత అక్కడే మిగిలింది. అక్కడే…

Read Full News
Optimized by Optimole